Chittoor: పాపసముద్రం సర్పంచ్ అభ్యర్థిగా అరుణ మోహన్ రెడ్డి నామినేషన్!
Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపసముద్రం సర్పంచ్ అభ్యర్థిగా అరుణ మోహన్ రెడ్డి నామినేషన్ వేశారు. తాగునీరు, రోడ్ల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.
Chittoor: పాపసముద్రం సర్పంచ్ అభ్యర్థిగా అరుణ మోహన్ రెడ్డి నామినేషన్!
చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపసముద్రం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అరుణ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవి చేను, పిల్లారి కుప్పం, పాపసముద్రం గ్రామ ప్రజలందరూ ఆదరించి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య,రోడ్లు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.ఈ సంవత్సరం పాప సముద్రానికి అవకాశం వచ్చిందని ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.




