Madanapalle: మదనపల్లెలో కుండపోత వర్షం: ఎన్టీఆర్ సర్కిల్ జలమయం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి శ్రీకృష్ణ లాడ్జి వరకు రోడ్డు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Srinivasulu, Madanapalle
Published on: 5 Nov 2026 10:37 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో కుండపోత వర్షం: ఎన్టీఆర్ సర్కిల్ జలమయం!

మదనపల్లె: మదనపల్లెలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా స్థానిక NTR సర్కిల్ నుంచి శ్రీకృష్ణ లాడ్జి వరకు ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. రోడ్డుపై మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ద్విచక్ర వాహనదారులు నీటిలో నుంచి ప్రయాణించేందుకు నానా అవస్థలు పడగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వర్షపు నీరు వెళ్లేందుకు తగిన మార్గాలు లేకపోవడం వల్లే ప్రతి భారీ వర్షానికి ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి NTR సర్కిల్ నుంచి శ్రీకృష్ణ లాడ్జి వరకు డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle