Madanapalle: అంకిశెట్టిపల్లె అభివృద్ధే లక్ష్యం: మోపూరి రెడ్డి శేఖర్ రెడ్డి!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె అంకిశెట్టిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో మోపూరి రెడ్డి శేఖర్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 21 Nov 2026 4:00 PM IST
Madanapalle
X

Madanapalle: అంకిశెట్టిపల్లె అభివృద్ధే లక్ష్యం: మోపూరి రెడ్డి శేఖర్ రెడ్డి!

మదనపల్లె: మదనపల్లె అంకిశెట్టిపల్లె గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి మోపూరి రెడ్డి శేఖర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం స్థానిక నాయకులు, అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి, ఆదరించి ఒక్కసారి సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని కోరారు. తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ కులమతాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.

ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అంకిశెట్టిపల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శరత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రమణ, రెడ్డి ప్రసాద్ రెడ్డి, రమణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హాజరై మద్దతు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle