Madanapalle: ప్రత్యేక పూజలతో బాధ్యతలు చేపట్టిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు.

Srinivasulu, Madanapalle
Published on: 19 Nov 2026 4:25 PM IST
Madanapalle
X

Madanapalle: ప్రత్యేక పూజలతో బాధ్యతలు చేపట్టిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు!

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు నూతన బాధ్యతలు చేపట్టే ముందు మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజల్లో పాల్గొని బాధ్యతల ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. చైర్మన్ పదవిని ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని, మదనపల్లె పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి కౌన్సిలర్లు, నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle