Madanapalle: మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై కూటమిలో పోటాపోటీ!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు ఎన్నికవడంతో, వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Srinivasulu, Madanapalle
Published on: 21 Nov 2026 11:19 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై కూటమిలో పోటాపోటీ!

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కూటమి పార్టీల్లో రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకోవడంతో వైస్ చైర్మన్ పీఠంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గ సమీకరణాలు, రాజకీయ ప్రాధాన్యతల నేపథ్యంలో పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మున్సిపాలిటీలో టీడీపీ 22, జనసేన 6, బీజేపీ 4 వార్డులు గెలుచుకుని కూటమి ఆధిక్యత సాధించింది. చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు ఎన్నికైన నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని ఓసీ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. టీడీపీ నుంచి బోయపాటి రంగస్వామి నాయుడు, బాబు నాయుడు, నాగార్జున గాంధీ పేర్లు వినిపిస్తుండగా, బీజేపీ నుంచి ఎల్లంపల్లి ప్రశాంత్, విజయశ్రీ, జనసేన నుంచి లక్ష్మీ దీపిక తదితరులు ఆశావహులుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మరోవైపు జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో పదవుల పంపకం, సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో తుది నిర్ణయం ఎవరికి అనుకూలంగా వస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సీల్డ్ కవర్‌లో వచ్చే పేరు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle