Rayachoti: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై వైసీపీ ఆరోపణలు అవాస్తవం: మంత్రి మండిపల్లి
Rayachoti: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ నియామకాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని, పూర్తిగా మెరిట్, అర్హత ప్రకారమే ఎంపిక జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
Rayachoti: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై వైసీపీ ఆరోపణలు అవాస్తవం: మంత్రి మండిపల్లి
Rayachoti: 2025-డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందన్న వైసీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. క్రీడా ప్రతిభ, నిబంధనల ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులకే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు.విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి లక్ష్యమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అసూయతోనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని తిరుపతి నాయుడు కాలనీకి చెందిన డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగులు N.లక్ష్మీపతి నాయక్ మరియు కట్ల రాముడిని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
వారు ఉద్యోగం సాధించేందుకు చేసిన కృషి, క్రీడా రంగంలో సాధించిన అర్హతల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.స్పోర్ట్స్ కోటాలో తమకు ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా డీఎస్సీ ద్వారా ఉద్యోగం లభించిందని లక్ష్మీపతి, కట్ల రాముడు మంత్రి ఎదుట తెలిపారు.అర్హత ఆధారంగానే తమకు ఉద్యోగ అవకాశం లభించిందని, దీనిపై తాము సంతోషంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.




