Annamayya: డీఆర్వోకు జనసేన ఏ-ఫారాలు అందజేసిన అడపా సురేంద్ర
Annamayya: అన్నమయ్య జిల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఏ-ఫారాలను పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర డీఆర్వోకు అందజేశారు.
Annamayya: డీఆర్వోకు జనసేన ఏ-ఫారాలు అందజేసిన అడపా సురేంద్ర
అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థుల ఏ-ఫారాలను పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఈరోజు స్వయంగా వెళ్లి డీఆర్వోకు అందజేశారు. ఈ సందర్భంగా అడపా సురేంద్ర మాట్లాడుతూ.. జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవసరమైన ఏ-ఫారాలను అధికారులకు అందజేసినట్లు తెలిపారు.
పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో నిబంధనల ప్రకారం ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగాలని తెలిపారు.




