Madanapalle: 39 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
Madanapalle: మదనపల్లెలో 1987 పదో తరగతి పూర్వ విద్యార్థులు దేవా రమేష్ ఆధ్వర్యంలో 39 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
Madanapalle: 39 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
మదనపల్లె: మదనపల్లె 1987లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 39 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయంగా గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు. మదనపల్లెలోని ప్రసన్న కార్ పార్కింగ్‌లో దేవా రమేష్ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి, స్నేహబంధాలు, ఉపాధ్యాయులతో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. వయసు పెరిగినా చిన్ననాటి స్నేహం, ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని ఈ కలయిక మరోసారి చాటిచెప్పింది.
ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, భవిష్యత్తులోనూ అందరూ తరచూ కలుసుకుంటూ సంతోషంగా గడపాలని పలువురు ఆకాంక్షించారు. 39 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఈ కలయిక పూర్వ విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపింది.




