Madanapalle: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మదనపల్లెకు వరం: ఆర్జే వెంకటేష్
Madanapalle: మదనపల్లెలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు రాయలసీమకు వరమని, ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడొద్దని ఆర్జే వెంకటేష్ అన్నారు.
Madanapalle: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మదనపల్లెకు వరం: ఆర్జే వెంకటేష్
Madanapalle: మదనపల్లెలో లక్ష కోట్ల పెట్టుబడితో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎంతో గొప్ప విషయమని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు.
పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ బహిరంగ సభను విజయవంతం చేసిన అధికారులు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర ప్రాంతాల్లోనూ విడతల వారీగా ఉద్యాన రంగ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల ద్వారా మదనపల్లె ప్రాంతానికి భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
వైసీపీ నాయకుడు నిస్సార్ అహ్మద్ చేసిన విమర్శలపై ఆర్జే వెంకటేష్ స్పందిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. “చెట్టు నాటగానే కాయలు కాస్తాయా? భారీ ప్రాజెక్టులకు ప్రణాళిక, అమలు వంటి అనేక దశలు ఉంటాయి. ఫలితాలు రావడానికి సమయం పడుతుంది” అని అన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా మదనపల్లె ప్రాంతానికి రానున్న అవకాశాలను గుర్తించాలని కోరారు.




