WhatsApp: విదేశాలకు వెళ్తున్నారా.? ఇక యాప్‌లోనే eSIM కొనేయొచ్చు!
WhatsApp: విదేశాలకు వెళ్లినప్పుడు కొత్త సిమ్ కొనకుండా, ఖరీదైన రోమింగ్ ప్లాన్లు లేకుండా వాట్సాప్‌లోనే eSIM కొని ఇన్‌స్టాల్ చేసుకునే ఫీచర్‌ను మెటా తీసుకురానుంది, ఇందుకోసం జియో, వెరిజోన్ సహా పలు టెలికం కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
WhatsApp: విదేశాలకు వెళ్తున్నారా.? ఇక యాప్‌లోనే eSIM కొనేయొచ్చు!
WhatsApp: విదేశాలకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్ కోసం కొత్త సిమ్ కొనడం లేదా ఖరీదైన రోమింగ్ ప్లాన్లు వేసుకోవడం ఇక అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్‌లోనే eSIM కొని, ఇన్‌స్టాల్ చేసుకునే ఫీచర్‌ను మెటా తీసుకురానుంది. దీనివల్ల విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే వాట్సాప్ వాడొచ్చు.
ఈ ఫీచర్‌ను నవంబర్ 26న వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ట్రావెల్ డేటా ఆధారంగా eSIMను కొనుగోలు చేసి, యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని తెలిపింది. అకౌంట్ స్క్రీన్‌లో దీని కోసం కొత్త ఆప్షన్ వస్తుందని సమాచారం.
ఇందుకోసం జియో, వెరిజోన్ సహా పలు టెలికం కంపెనీలతో వాట్సాప్ కలిసి పనిచేస్తోంది. కంబోడియాకు చెందిన స్మార్ట్ ఆక్సియాటా, ఫిలిప్పీన్స్‌కు చెందిన స్మార్ట్ కమ్యూనికేషన్స్, eSIM ప్రొవైడర్ 1గ్లోబల్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. మరిన్ని దేశాలకు విస్తరించేందుకు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సంస్థలతో జట్టు కడతామని వాట్సాప్ తెలిపింది.
ఎంపిక చేసిన దేశాల్లో త్వరలోనే ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. అయితే లాంచ్ తేదీని, ప్లాన్ ధరలను ఇంకా వెల్లడించలేదు. తొలి దశలో భారత్‌కు అవకాశం ఉంటుందా అనే దానిపై కూడా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఎయిరాలో, హోలీఫై, నోమాడ్ వంటి సంస్థలు అంతర్జాతీయ eSIM ప్లాన్లను అందిస్తున్నాయి.
వీటికి భిన్నంగా వాట్సాప్‌లో కొనుగోలు, ఇన్‌స్టాలేషన్, ప్లాన్ నిర్వహణ అన్నీ యాప్‌లోనే చేసుకోవచ్చు. విదేశాల్లో అడుగుపెట్టగానే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కనెక్ట్ అవ్వడం ఇంకా సులభం కానుందని వాట్సాప్ చెబుతోంది.




