UPI Payments: గూగుల్‌పే, ఫోన్‌పేతో SIP చేస్తున్నారా.? మారిన రూల్స్‌తో పడే ప్రభావం ఏంటంటే.?
UPI Payments: ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్లలో SIP చేసే వారికి UPIకి సంబంధించిన కొత్త నిబంధనలు ఆసక్తికరంగా మారాయి.
UPI Payments: గూగుల్‌పే, ఫోన్‌పేతో SIP చేస్తున్నారా.? మారిన రూల్స్‌తో పడే ప్రభావం ఏంటంటే.?
UPI Payments: ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్లలో SIP చేసే వారికి UPIకి సంబంధించిన కొత్త నిబంధనలు ఆసక్తికరంగా మారాయి. 2026 అక్టోబర్ 15 నుంచి కొన్ని UPI చెల్లింపులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది. మరి దీంతో చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 15 నుంచి UPIలో ఏం మారనుంది?
అక్టోబర్ 15, 2026 నుంచి కొన్ని UPI మర్చంట్ పేమెంట్స్‌పై MDR అమల్లోకి రానుంది. అయితే అన్ని UPI లావాదేవీలకు ఈ ఛార్జీ వర్తించదు. సాధారణంగా రూ.2,000 వరకు చేసే UPI చెల్లింపులకు MDR ఉండదు. వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే UPI చెల్లింపులు కూడా ఉచితంగానే కొనసాగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. MDR అనేది సాధారణంగా వ్యాపారి లేదా చెల్లింపును స్వీకరించే సంస్థపై విధించే ఛార్జీ. వినియోగదారుడి ఖాతా నుంచి ప్రత్యేకంగా ఈ మొత్తాన్ని కట్ చేయరు. కాబట్టి UPI వాడుతున్న ప్రతి వ్యక్తి ఇకపై ప్రతి చెల్లింపునకు ఛార్జీ చెల్లించాల్సి వస్తుందని అనుకోవద్దు.
SIP చేసే వారికి కొత్త రూల్‌తో ఛార్జీ పడుతుందా?
మీరు UPI ఆటోపే లేదా UPI మ్యాండెంట్ ద్వారా ప్రతి నెలా ఆటోమేటిక్‌గా SIP చెల్లించేలా ముందుగానే అనుమతి ఇచ్చి ఉంటే, ఆ రెగ్యులర్ SIP వాయిదాపై కొత్త MDR నేరుగా వర్తించదు. UPI AutoPay ద్వారా జరిగే పునరావృత చెల్లింపులకు ప్రిస్బ్రైడ్ MDR ఉండదని తెలుస్తోంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.5,000 SIP పెట్టుకున్నారనుకుందాం. ప్రతి నెలా నిర్ణీత తేదీన మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.5,000 ఆటోమేటిక్‌గా మ్యూచువల్ ఫండ్‌కు వెళ్లేలా UPI AutoPay పెట్టి ఉంటే, అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త MDR కారణంగా మీ SIP మొత్తం పెరగదు.
NPCI కూడా UPI AutoPay ద్వారా మ్యూచువల్ ఫండ్స్ వంటి రికరింగ్ పేమెంట్స్ చేయడానికి అవకాశం ఉందని పేర్కొంది.
మరి 0.02 శాతం MDR ఎప్పుడు వర్తిస్తుంది?
మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్లు వంటి క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ కోసం చేసే కొన్ని UPI చెల్లింపులకు ప్రత్యేకంగా 0.02% MDR నిర్ణయించారు. ఈ ఛార్జీ ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వరకు ఉంటుంది. ఉదాహరణకు UPI ద్వారా అర్హత ఉన్న ఒకసారి చేసే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి రూ.10,000 అయితే 0.02% ప్రకారం MDR రూ.2 అవుతుంది. రూ.50,000 చెల్లింపుపై అది రూ.10 అవుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చేసే పెట్టుబడి (వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్), UPI ఆటోపే ద్వారా జరిగే రెగ్యులర్ SIP మధ్య తేడాను గుర్తుంచుకోవాలి. తాజా వివరాల ప్రకారం UPI ఆటోపే ద్వారా జరిగే రికరింగ్ SIPలు ఈ ప్రిస్బ్రైబ్డ్ MDR నుంచి మినహాయింపు ఉంటుంది. మరోవైపు UPI ద్వారా చేసే కొన్ని వన్ టైమ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై 0.02% MDR వర్తించవచ్చు.
గూగుల్ పే, ఫోన్‌పే వాడే SIP ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
మీ SIP ఇప్పటికే UPI ఆటోపే ద్వారా ఆటోమేటిక్‌గా కొనసాగుతుంటే, కొత్త UPI MDR రూల్ కారణంగా వెంటనే SIP ఆపాల్సిన అవసరం లేదు. ఈ రికరింగ్ మాండేట్‌పై కొత్త MDR నేరుగా విధించబడదని ప్రస్తుత సమాచారం చెబుతోంది. అయితే మీరు ప్రతి నెలా స్వయంగా UPI ద్వారా SIP మొత్తాన్ని చెల్లిస్తున్నట్లయితే, అది రికరింగ్ ఆటోపే మ్యాండేటా లేదా వన్ టైమ్ పేమెంటా అనేది గమనించాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్‌లో ఒకేసారి చేసే UPI పెట్టుబడులకు 0.02% MDR వర్తించే అవకాశం ఉంది.
మొత్తంగా చెప్పాలంటే.. అక్టోబర్ 15 నుంచి UPIలో కొన్ని లావాదేవీలకు MDR వస్తున్నప్పటికీ, UPI AutoPay ద్వారా నడిచే సాధారణ SIPలకు కొత్త ఛార్జీ నేరుగా వర్తించదు. అయితే UPI ద్వారా చేసే కొన్ని one-time మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ సంబంధిత చెల్లింపులకు 0.02% MDR వర్తించవచ్చు.




