Upasana Konidela: అపోలోలో కీలక బాధ్యతలు చేపట్టిన ఉపాసన..!

Upasana Konidela: అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ విభాగానికి డైరెక్టర్‌గా ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా రూ.8,600 కోట్ల విస్తరణ ప్రణాళికలను ఆమె పర్యవేక్షించనున్నారు.

Arun Chilukuri
Published on: 24 Sept 2026 3:04 PM IST
Upasana Konidela
X

Upasana Konidela: అపోలోలో కీలక బాధ్యతలు చేపట్టిన ఉపాసన..!

Upasana Konidela: ప్రముఖ హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ "ప్రాజెక్ట్స్" విభాగానికి మెగా కోడలు, నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్‌ఆర్‌ (CSR) విభాగానికి వైస్ ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తున్న ఆమె, ఇకపై డైరెక్టర్ హోదాలో దేశవ్యాప్తంగా ఆసుపత్రి ప్రాజెక్టుల అభివృద్ధిని పర్యవేక్షించనున్నారు.

ఆసుపత్రి విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అపోలో హాస్పిటల్స్ సంస్థ రూ. 8,600 కోట్లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఉపాసన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అందరికీ ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించాలన్న తమ తాతగారు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తనపై ఉన్న బాధ్యతగా ఆమె పేర్కొన్నారు.

అపోలో హాస్పిటల్స్‌తో పాటు డిజిటల్ వెల్‌నెస్, కార్పొరేట్ ప్లాట్‌ఫామ్‌ అయిన 'యువర్‌లైఫ్' (URlife) కు కూడా ఉపాసన మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ వ్యాపార రంగంలోనూ దూసుకెళ్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.