No UPI Day: యూజర్లకు బిగ్ రిలీఫ్.. 'నో యూపీఐ డే' నిరసనకు బ్రేక్

No UPI Day: ఎండీఆర్ ఛార్జీలకు నిరసనగా తలపెట్టిన 'నో యూపీఐ డే' నిరసనను వాణిజ్య సంఘాలు విరమించుకున్నాయి.

Gagan kumar
Published on: 1 Oct 2026 7:28 AM IST
No UPI Day
X

No UPI Day: యూజర్లకు బిగ్ రిలీఫ్.. 'నో యూపీఐ డే' నిరసనకు బ్రేక్

No UPI Day: డిజిటల్ పేమెంట్స్ ప్రియులకు, వ్యాపారులకు ఇది ఊరటనిచ్చే వార్త. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల పెంపునకు నిరసనగా అక్టోబర్ 2న తలపెట్టిన నో యూపీఐ డే నిరసన కార్యక్రమాన్ని ప్రముఖ వాణిజ్య సంఘాలు రద్దు చేసుకున్నాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ , ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాయి.

రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ బిజినెస్ లావాదేవీలపై ఛార్జీలు విధించాలనే నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసింది.

ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తున్నందున, వ్యాపారాలు ఊపందుకునే ఈ సమయంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టవద్దని వారు కోరారు. అలాగే, బిజినెస్-టు-బిజినెస్ లావాదేవీలను ఎండీఆర్ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తుందన్న పూర్తి నమ్మకం కుదిరినందుకే నిరసనను విరమించుకుంటున్నట్లు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న యూపీఐ సేవలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే.

సామాన్య ప్రజలు చేసే వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇవి మునుపటిలాగే పూర్తిగా ఉచితం. అక్టోబర్ 15 నుండి వ్యాపారులకు జరిగే చెల్లింపులపై 0.40 శాతం మేర ఎండీఆర్ రుసుము వర్తిస్తుందని ఎన్‌పీసీఐ పేర్కొంది. ప్రస్తుతానికి నిరసనలు వీడటంతో యూపీఐ లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సజావుగా సాగనున్నాయి. పండుగ సీజన్‌లో డిజిటల్ చెల్లింపులు చేసేవారికి ఇది నిజంగానే పెద్ద ఉపశమనం.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.