Tata Sons: టాటా సన్స్ ఛైర్మన్‌గా మరో ఐదేళ్లు ఎన్ చంద్రశేఖరన్ కొనసాగింపు!
Tata Sons: టాటా సన్స్ ఛైర్మన్‌గా మరో ఐదేళ్ల పాటు ఎన్ చంద్రశేఖరన్ కొనసాగింపు. బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం, నోయెల్ టాటా వ్యతిరేకత.
Tata Sons: టాటా సన్స్ ఛైర్మన్‌గా మరో ఐదేళ్లు ఎన్ చంద్రశేఖరన్ కొనసాగింపు!
Tata Sons: టాటా గ్రూపులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ (Tata Sons) ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekaran) మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయన మూడోసారి నియామకానికి టాటా సన్స్ బోర్డు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోసారి తన పునర్నియామకాన్ని కోరుకోవడం లేదంటూ చంద్రశేఖరన్ బోర్డు డైరెక్టర్లకు స్పష్టం చేసిన కొద్ది వారాలకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే దీనిపై టాటా సన్స్ గానీ, టాటా ట్రస్టులు గానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను వదులుకోవడానికి టాటా సన్స్ చేసిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో టాటా సన్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అనివార్యం కానుంది. ఈ కీలక తరుణంలో నాయకత్వ మార్పు సరికాదనే అభిప్రాయం బోర్డు సభ్యుల్లో వ్యక్తమైనట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన చంద్రశేఖరన్ కొనసాగితేనే పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందని భావించిన బోర్డు.. ఆయనను తన నిర్ణయంపై పునరాలోచన చేయాల్సిందిగా నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ ద్వారా కోరనుంది.
అయితే, జరిగిన బోర్డు సమావేశంలో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా.. చంద్రశేఖరన్ పునఃనియామకానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలిసింది. టాటా సన్స్ లిస్టింగ్ విషయంలోనూ ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ బోర్డులోని మెజారిటీ సభ్యులు చంద్రశేఖరన్ నియామకానికి పచ్చజెండా ఊపడంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. తాజా పరిణామంతో కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయినట్లయింది.




