Silver Price: మళ్లీ వెండికి గోల్డెన్ డేస్.. దూకుడు మీదున్న సిల్వర్, ఒక్కరోజులోనే ఏకంగా
Silver Price: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం భారీ ర్యాలీ కొనసాగిస్తోంది.
Silver Price: మళ్లీ వెండికి గోల్డెన్ డేస్.. దూకుడు మీదున్న సిల్వర్, ఒక్కరోజులోనే ఏకంగా
Silver Price: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం భారీ ర్యాలీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఒక్క రోజులోనే కిలో వెండి ధర దాదాపు రూ.15 వేల వరకు పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది.
వెండి ధర భారీగా పెరిగింది
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ ధరలు ఒక్కసారిగా 6 శాతం పెరిగి ఔన్స్‌కు 85 డాలర్లకు పైగా చేరాయి. ఇదే సమయంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారత మార్కెట్‌లో కూడా వెండి భారీ లాభాలు నమోదు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో జూలై 2026 కాంట్రాక్ట్‌కు సంబంధించిన వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.2,90,000కి చేరింది. దీంతో చాలా రోజుల తర్వాత కిలో వెండి మళ్లీ రూ. 3 లక్షల మార్క్‌కి చేరువవుతోంది. మరోవైపు బంగారం మాత్రం తక్కువ మొత్తంలో పెరిగింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 15,39,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఈ ఏడాది ప్రారంభంలో వెండి భారీ పతనాన్ని చూసింది. జనవరిలో ఔన్స్‌కు 121 డాలర్లకు పైగా వెళ్లిన వెండి, తర్వాత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్ పరిస్థితుల ప్రభావంతో భారీగా పడిపోయింది. మార్చిలో వెండి ధర 60 డాలర్ల స్థాయికి కూడా చేరింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత ఆరు వారాలుగా వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. టెక్నికల్ చార్ట్స్ ప్రకారం వెండి కీలక రెసిస్టెన్స్ స్థాయులను దాటడం ట్రేడర్లలో నమ్మకాన్ని పెంచుతోంది.
పెట్టుబడిదారులకు హెచ్చరిక
వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ మార్కెట్‌లో రిస్క్ పూర్తిగా తగ్గలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కీలక స్థాయులను వెండి నిలబెట్టుకోలేకపోతే మళ్లీ ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ప్రత్యేకంగా అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ బలం, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు వెండి ధరలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.




