పెట్రోల్ బంకుల్లో ఈ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!

SBI Credit Card Rules: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు డిసెంబర్ 1 నుంచి ఇంధన, రవాణా చెల్లింపులపై 1% అదనపు ఛార్జీలు వర్తించనున్నాయి. పూర్తి వివరాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Oct 2026 5:00 AM IST
SBI Credit Card Rules
X

పెట్రోల్ బంకుల్లో ఈ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక. ఇంధన కొనుగోళ్లు మరియు రవాణా సంబంధిత చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధిస్తూ ఎస్‌బీఐ కార్డ్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. నిర్దేశిత పరిమితిని మించి లావాదేవీలు జరిగితే వినియోగదారులు 1 శాతం అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఇంధన ఖర్చు రూ.50 వేలు దాటితే:

పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డులను విరివిగా వాడే వారికి ఇది ముఖ్యమైన గమనిక. ఇంధన కొనుగోళ్లకు సంబంధించి ఒక బిల్లింగ్ సైకిల్‌లో కార్డుదారుడి మొత్తం ఫ్యూయల్ ఖర్చు రూ.50,000 దాటితే, ఆ బిల్లింగ్ సైకిల్‌లో చేసిన మొత్తం ఇంధన చెల్లింపులపై 1 శాతం రుసుము విధిస్తారు. ఉదాహరణకు ఒక నెలలో ఇంధనం కోసం రూ.60,000 ఖర్చు చేస్తే, మొత్తంపై 1 శాతం చొప్పున రూ.600 అదనంగా చెల్లించాలి. ఈ నిబంధన MCC 5172, 5541, 5542, 5983 కోడ్ల కింద నమోదయ్యే ఫ్యూయల్ లావాదేవీలకు వర్తిస్తుంది.

రవాణా చెల్లింపులపై నిబంధనలు ఇలా:

ట్రాన్స్‌పోర్ట్ లేదా రవాణా సేవలకు సంబంధించిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీని పరిగణనలోకి తీసుకుంటారు. రవాణా సేవలకు సంబంధించిన ఒక్కో లావాదేవీ విలువ రూ.30,000 దాటితే దానిపై 1 శాతం అదనపు ఛార్జీ పడుతుంది. ఒకవేళ లావాదేవీ రూ.30,000 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఈ అదనపు ఛార్జీ వర్తించదు. ఈ నిబంధన MCC 4111, 4784, 4131 కోడ్ల కింద గుర్తించే లావాదేవీలకు వర్తిస్తుంది.

క్రెడిట్ కార్డు ద్వారా అధిక మొత్తంలో ఫ్యూయల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు చెల్లించేవారు ఈ కొత్త మార్పులను దృష్టిలో ఉంచుకుని ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్