RBI Repo Rate Hike: ఆర్‌బీఐ షాక్.. 25 బేసిస్‌ పాయింట్లు పెరిగిన రెపో రేటు.. ప్రియం కానున్న గృహ, వాహన రుణాలు!

RBI Hikes Repo Rate: ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను సవరిస్తూ రెపో రేటును 0.25 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరగా.. గృహ, వాహన రుణాలు ప్రియం కానున్నాయి.

Arun Chilukuri
Published on: 7 Oct 2026 11:00 AM IST
RBI Repo Rate Hike
X

RBI Repo Rate Hike: ఆర్‌బీఐ షాక్.. 25 బేసిస్‌ పాయింట్లు పెరిగిన రెపో రేటు.. ప్రియం కానున్న గృహ, వాహన రుణాలు!

RBI Hikes Repo Rate: అందరూ ఊహించిందే జరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల (0.25%) మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. 2023 ఫిబ్రవరి తర్వాత ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజా నిర్ణయంతో రెపో రేటుతో ముడిపడి ఉన్న గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

పశ్చిమాసియా ఘర్షణల వల్ల దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణానికి ముప్పు పెరుగుతున్న వేళ.. ఆర్‌బీఐ ఈసారి వడ్డీరేట్లను సవరించి రెపో రేటును 5.50 శాతానికి పెంచింది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్థిర వైఖరి నుంచి కఠిన వైఖరికి మారాలని ద్రవ్య విధాన పరపతి సమీక్ష నిర్ణయించింది. అంటే సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశం లేదని స్పష్టమైంది.

2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదవ్వొచ్చని, ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. బలహీన రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావం రబీ సీజన్‌పై ఉంటుందని పేర్కొంది.

దేశంలో ఫారిన్‌ ఎక్స్ఛేంజీ నిల్వలు అత్యంత ఆరోగ్యకరంగా ఉన్నాయని, రాబోయే 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఢోకా లేదని గవర్నర్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.