Post Office: రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. 5 ఏళ్ల తర్వాత అసలుతో పాటు రూ. 2 లక్షల వడ్డీ పొందొచ్చు
Post Office: చేతిలో ఉన్న డబ్బును పెద్దగా రిస్క్ లేకుండా భద్రంగా పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తుంటారు.
Post Office: రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. 5 ఏళ్ల తర్వాత అసలుతో పాటు రూ. 2 లక్షల వడ్డీ పొందొచ్చు
Post Office: చేతిలో ఉన్న డబ్బును పెద్దగా రిస్క్ లేకుండా భద్రంగా పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారికి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఒక ఆప్షన్‌గా నిలుస్తాయి. అందులో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) కూడా ఒకటి.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అంటే ఏంటి?
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌ను సాధారణంగా ఒకేసారి డబ్బు పెట్టి నిర్ణీత కాలం వరకు కొనసాగించే పొదుపు పథకంగా చెప్పొచ్చు. ఇందులో 1, 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఖాతా ప్రారంభించే సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే ఆ డిపాజిట్‌కు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ కాలపరిమితులకు వర్తించే వడ్డీ రేట్లు 1 సంవత్సరానికి 6.9 శాతం, 2 సంవత్సరాలకు 7.0 శాతం, 3 సంవత్సరాలకు 7.1 శాతం, 5 సంవత్సరాలకు 7.5 శాతంగా ఉన్నాయి.
రూ.5 లక్షలు పెడితే ఐదేళ్లకు ఎంత?
ఒక వ్యక్తి 5 సంవత్సరాల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో రూ.5,00,000 పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. ప్రస్తుతం వర్తిస్తున్న 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి రూ.37,500 వడ్డీ వస్తుంది. అంటే ఐదేళ్లలో మొత్తం వడ్డీ రూ.1,87,500 అవుతుంది. అసలు రూ.5 లక్షలను కలిపితే ఐదేళ్ల వ్యవధిలో రూ.6,87,500 అందుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పోస్టాఫీస్ TDలో వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించినప్పటికీ, అది ప్రతి ఏడాది చెల్లిస్తారు.
వడ్డీ ఎలా చెల్లిస్తారు?
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో వడ్డీ సంవత్సరానికి ఒకసారి చెల్లించే విధానం ఉంది. ఖాతాదారుడి ఎంపిక ప్రకారం వార్షిక వడ్డీని సేవింగ్స్ ఖాతాలోకి క్రెడిట్ చేయించుకోవచ్చు. అంటే ప్రతి ఏడాది వచ్చే వడ్డీని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఐదేళ్ల డిపాజిట్‌ను మధ్యలోనే మూసివేయాలనుకుంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. సాధారణంగా డిపాజిట్ ప్రారంభించిన ఆరు నెలలలోపు డబ్బు తీసుకునే అవకాశం ఉండదు. ముందుగానే ఖాతా మూసివేస్తే వర్తించే వడ్డీ రేటు కూడా మారొచ్చు.
ఈ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది?
స్టాక్ మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులను కోరుకోని వారు, నిర్దిష్ట కాలానికి డబ్బును పక్కన పెట్టాలనుకునే వారు పోస్టాఫీస్ TDని పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఒకేసారి అందుబాటులో ఉన్న మొత్తాన్ని ఐదేళ్లపాటు పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక ఎంపిక.
అయితే పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు, పన్ను ప్రభావం, ముందస్తు విత్‌డ్రా నిబంధనలు తెలుసుకోవడం మంచిది. పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షిస్తుంది. కాబట్టి ఖాతా తెరిచే సమయంలో మీకు సమీపంలోని పోస్టాఫీస్‌ను సంప్రదించండి.




