ఈ బ్యాంక్ 680 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ అందిస్తోంది.. రూ.5 లక్షలకు ఎంత వడ్డీ వస్తుందంటే?
PNB Special FD: తమ పొదుపు సొమ్ముకు భద్రతతో పాటు నిర్ణీత వడ్డీ పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి మార్గం. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 680 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకం అందిస్తోంది.
ఈ బ్యాంక్ 680 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ అందిస్తోంది.. రూ.5 లక్షలకు ఎంత వడ్డీ వస్తుందంటే?
PNB Special FD: తమ పొదుపు సొమ్ముకు భద్రతతో పాటు నిర్ణీత వడ్డీ పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి మార్గం. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 680 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకం అందిస్తోంది. ఈ స్కీమ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
PNB 680 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ వివరాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తున్న ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి 680 రోజులు. అంటే సుమారు ఏడాది 10 నెలల 10 రోజులు. ఖాతాదారుల వయసును బట్టి బ్యాంకు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తోంది. వడ్డీ రేట్ల విషయానికొస్తే ఈ ఎఫ్‌డీపై సాధారణ ఖాతాదారులకు ఏడాదికి 6.90 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 7.40 శాతం,
సూపర్ సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 7.65 శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ లభిస్తుంది. దీంతో వృద్ధులు తమ పొదుపు మొత్తంపై మరింత రాబడి పొందే అవకాశం ఉంటుంది.
రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది?
ఈ 680 రోజుల ఎఫ్‌డీలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఖాతాదారుల వయసును బట్టి వచ్చే అంచనా వడ్డీ ఇలా ఉంటుంది. త్రైమాసిక చక్రవడ్డీ లెక్కింపు ఆధారంగా ఈ మొత్తాలను అంచనా వేశారు. సాధారణ ఖాతాదారులకు రూ.67,965 వడ్డీ, సీనియర్ సిటిజన్లకు రూ.73,187 వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.75,813 వడ్డీ లభిస్తుంది.
అంటే రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీతో కలిపి సాధారణ ఖాతాదారులకు సుమారు రూ.5.68 లక్షలు, సీనియర్ సిటిజన్లకు రూ.5.73 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5.75 లక్షలు అందే అవకాశం ఉంటుంది.
రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత రాబడి?
ఒకవేళ రూ.5 లక్షలకు బదులుగా రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే వచ్చే అంచనా వడ్డీ మరింత ఎక్కువగా ఉంటుంది.
సాధారణ ఖాతాదారులకు రూ.1,35,930 వడ్డీ, సీనియర్ సిటిజన్లకు రూ.1,46,373 వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.1,51,626 వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కల ప్రకారం రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన సాధారణ ఖాతాదారులకు మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.11,35,930 లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.11,46,373, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.11,51,626 వరకు అందవచ్చు.
ఇంట్లో నుంచే ఎఫ్‌డీ ప్రారంభించవచ్చు
PNB ఖాతాదారులు బ్యాంకు శాఖకు వెళ్లకుండానే ఈ ఎఫ్‌డీని బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం బ్యాంకు అందిస్తున్న పలు డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చు. PNB One మొబైల్ యాప్, PNB ఇంటర్నెట్ బ్యాంకింగ్ , వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా ఎఫ్‌డీ ఓపెన్ చేయొచ్చు. వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం 9264092640 నంబర్‌ను ఉపయోగించవచ్చు. అలాగే బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ pnb.bank.in ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
అయితే ఎఫ్‌డీ చేయడానికి ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. నిర్ణీత గడువు కంటే ముందే డిపాజిట్‌ను వెనక్కి తీసుకుంటే పెనాల్టీ వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఎఫ్‌డీపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను నిబంధనలు వర్తిస్తాయి. పైన పేర్కొన్న వడ్డీ మొత్తాలు అంచనాలు మాత్రమే. వాస్తవ మెచ్యూరిటీ మొత్తం బ్యాంకు లెక్కింపు, అమల్లో ఉన్న నిబంధనలను బట్టి మారవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు బ్యాంకును సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.




