PhonePe: దీపావళికి ఫోన్‌పే ప్రత్యేక కానుక.. రూ. 11లకే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్!

PhonePe: దీపావళి పండుగను ప్రజలు ఎటువంటి భయాలు లేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకునేలా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ 'ఫోన్‌పే' కీలక నిర్ణయం.

G Krishna
Published on: 22 Oct 2026 5:07 PM IST
PhonePe
X

PhonePe: దీపావళికి ఫోన్‌పే ప్రత్యేక కానుక.. రూ. 11లకే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్!

PhonePe: దీపావళి పండుగను ప్రజలు ఎటువంటి భయాలు లేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకునేలా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ 'ఫోన్‌పే' కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సమయంలో జరిగే ఊహించని అవాంఛనీయ ప్రమాదాలు, అగ్నిప్రమాపాల నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో తన సమగ్ర 'ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్' (Firecracker Insurance) పాలసీని వరుసగా మూడో ఏడాది కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సహకారంతో డిజిటల్ వేదికగా అందిస్తున్న ఈ సీజనల్ మైక్రో-ఇన్సూరెన్స్ కేవలం రూ. 11ల ప్రారంభ ధరతో వినియోగదారులకు భరోసా కల్పిస్తోంది.

పాలసీలో లభించే ప్రధాన ప్రయోజనాలు

పటాకులు కాల్చే సమయంలో జరిగే ప్రమాదాల నుంచి వినియోగదారులకు పటిష్టమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ బీమా పాలసీని రూపకల్పన చేశారు. ఇది ప్రధానంగా మూడు రకాల రక్షణలను అందిస్తుంది. పటాకుల గాయాల కారణంగా 24 గంటలకు పైగా ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ చికిత్స తీసుకోవాల్సి వస్తే రూ. 25,000 వరకు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. అలాగే 24 గంటల కంటే తక్కువ సమయంలో పూర్తయ్యే చిన్నపాటి వైద్య చికిత్సలు లేదా కాలిన గాయాల డె కేర్ (Day-Care) చికిత్సల నిమిత్తం కూడా రూ. 25,000 వరకు వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయి. వీటితో పాటు పాలసీదారుడికి ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే నామినీకి లేదా కుటుంబానికి రూ. 25,000 లంప్సమ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కింద అందుతుంది.

నిమిషం వ్యవధిలో సులభంగా కొనుగోలు చేసే విధానం

ఈ బీమా ప్రక్రియను ఎంతో సులభంగా, పారదర్శకంగా రూపొందించారు. వినియోగదారులు ఎలాంటి క్లిష్టమైన ప్రక్రియ లేకుండా కేవలం నిమిషం వ్యవధిలోనే ఫోన్‌పే యాప్ ద్వారా ఈ పాలసీని కొనుగోలు చేసి తక్షణ బీమా రక్షణను పొందవచ్చు. ఫోన్‌పే యాప్‌ను తెరిచి అందులోని ఇన్సూరెన్స్ సెక్షన్‌కు వెళ్లి ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రూ. 25,000 సమ్ ఇన్ష్యూర్డ్ కోసం రూ. 11 లేదా రూ. 21తో అందుబాటులో ఉన్న ప్లాన్ వివరాలను పరిశీలించి, బీమా అందించే సంస్థ సమాచారంతో పాటు ప్లాన్ ప్రయోజనాల పూర్తి వివరాలను తనిఖీ చేసుకోవాలి. చివరిగా పాలసీదారుడి వివరాలను నమోదు చేసి, ప్రొసీడ్ టు పే ఆప్షన్‌పై క్లిక్ చేసి చెల్లింపు పూర్తి చేస్తే తక్షణమే బీమా కవరేజ్ లభిస్తుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.