Petrol price: 50 నెలల గరిష్ఠానికి చేరిన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపించనున్నాయా.?
Petrol price: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.
Petrol price: 50 నెలల గరిష్ఠానికి చేరిన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపించనున్నాయా.?
Petrol price: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన పెట్రోల్ అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర 50 నెలల గరిష్ఠ స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో అంతరాయాలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
50 నెలల గరిష్ఠానికి పెట్రోల్ బెంచ్‌మార్క్ ధర:
భారత్‌కు సంబంధించిన పెట్రోల్ అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు 133.05 డాలర్లకు చేరింది. ఇది గత 50 నెలల్లో నమోదైన అత్యధిక స్థాయి. సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు రోజువారీ సగటు పెట్రోల్ బెంచ్‌మార్క్ ధర ఆగస్టు సగటు 110.87 డాలర్లతో పోలిస్తే దాదాపు 20 శాతం ఎక్కువగా ఉంది. మేలో నమోదైన 129.63 డాలర్ల గరిష్ఠాన్ని కూడా ప్రస్తుత ధర అధిగమించింది.
భారత్ తన అవసరాల్లో 85 శాతానికి పైగా ముడిచమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడే అవకాశం ఉంటుంది.
చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరోసారి 100 డాలర్లకు పైగా వెళ్లాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నాయి.
అలాగే సౌదీ అరేబియాలో పైప్‌లైన్ కార్యకలాపాల్లో అంతరాయాలతో పాటు ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా సరఫరాలో ఇబ్బందులు ఏర్పడటం కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు సరఫరా తగ్గుతుందనే ఆందోళన పెరిగినప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు సాధారణంగా పెరిగే అవకాశం ఉంటుంది.
చమురు కంపెనీలకు పెరుగుతున్న నష్టాలు:
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వెంటనే అదే స్థాయిలో మార్పులు జరగకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతం కంపెనీలకు పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.5, డీజిల్‌పై లీటరుకు సుమారు రూ.20 వరకు నష్టం వస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక డీజిల్‌కు సంబంధించిన రోజువారీ సగటు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర బ్యారెల్‌కు 167.08 డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ఠ స్థాయి. అయితే 2026 ఏప్రిల్‌లో నమోదైన 187.92 డాలర్ల గరిష్ఠంతో పోలిస్తే ఇది ఇంకా తక్కువగానే ఉంది.
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
సెప్టెంబర్ 21న దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ఉద్రిక్తతలు కొనసాగి, ముడిచమురు ధరలు ఇదే స్థాయిలో అధికంగా ఉంటే రానున్న రోజుల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం కేవలం ఇంధన ధరలకే పరిమితం కాకపోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశోధన ప్రకారం, ముడిచమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే దేశంలోని హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం సుమారు 49 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దాంతో కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులు, ఇతర సరుకుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.




