పెన్షన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలు ఇంటి వద్దకే!
Pension: పెన్షన్ తీసుకునే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) ఒకటి. పెన్షన్ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి.
పెన్షన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలు ఇంటి వద్దకే!
Pension: పెన్షన్ తీసుకునే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) ఒకటి. పెన్షన్ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. అయితే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ఈ పత్రం కోసం బ్యాంకులకు వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి కేంద్రం శుభవార్త తెలిపింది.
పెన్షనర్లకు ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందుతున్నవారు ప్రతి సంవత్సరం తాము జీవించి ఉన్నట్లు ధ్రువీకరించేందుకు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. సాధారణంగా బ్యాంకుకు వెళ్లి లేదా బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. డిజిటల్ విధానంలోనూ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం ఉంది.
అయితే వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వారి కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇంటి వద్దకే సేవలు అందుబాటులో ఉన్నాయి. పోస్టుమ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్ ఇంటికి వచ్చి అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తారు. దీంతో పెన్షనర్లు బ్యాంకులకు వెళ్లే ఇబ్బందులు లేకుండా ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఈ సేవను పొందడానికి IPPB ఖాతాదారులై ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇతర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న పెన్షనర్లు సైతం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇంటి వద్ద సేవ పొందాలంటే ఏం చేయాలి?
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కోసం ఇంటి వద్ద సేవను పొందాలనుకునే పెన్షనర్లు 033-22029000 నంబర్‌కు కాల్ చేసి పోస్టుమ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్‌ను ఇంటికి పంపించాలని కోరవచ్చు. ఈ సేవలో భాగంగా పోస్టల్ సిబ్బంది ఇంటికి వచ్చి బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ రూపొందించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ వ్యవస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) రూపొందించిన జీవన్ ప్రమాణ్ అప్లికేషన్‌తో అనుసంధానమై ఉంటుంది.
ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత పెన్షనర్‌కు ప్రత్యేకమైన ప్రామాణ్ ఐడీ (Pramaan ID) జనరేట్ అవుతుంది. ఈ ఐడీని NIC నేరుగా పెన్షనర్‌తో పంచుకుంటుంది. ప్రామాణ్ ఐడీ వచ్చిన తర్వాత జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ సేవకు ఎంత చెల్లించాలి?
ఇంటి వద్దకే వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జారీ చేసే సేవకు ప్రతి విజయవంతమైన సర్టిఫికెట్ కోసం రూ.70 (GST, CESS సహా) చెల్లించాలి. ఈ మొత్తమే సేవకు సంబంధించిన రుసుము. దీనికి అదనంగా ఇంటి వద్ద సేవ అందించినందుకు ప్రత్యేకంగా డోర్‌స్టెప్ ఛార్జీలు వసూలు చేయరు. IPPB ఖాతాదారులతో పాటు ఇతర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న పెన్షనర్లు కూడా ఈ సేవను పొందవచ్చు.
అయితే పెన్షన్ చెల్లించే సంస్థ లేదా ఏజెన్సీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానంలో అందుబాటులో ఉండాలి. జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్‌సైట్‌లోని సంబంధిత సంస్థల జాబితా ద్వారా తమ పెన్షన్ చెల్లించే ఏజెన్సీ ఈ సేవకు అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చు.
జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ అయినంత మాత్రాన పెన్షన్ చెల్లించే సంస్థ దాన్ని ఆమోదించినట్లు కాదు. అందువల్ల సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత దాని స్థితిని కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. ఇందుకోసం ముందుగా.. ముందుగా జీవన్ ప్రమాణ్ అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయండి. అక్కడ అందుబాటులో ఉన్న సేవల ద్వారా మీ ప్రామాణ్ ఐడీని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ వివరాలను పరిశీలించండి.
సర్టిఫికెట్ స్థితిని తనిఖీ చేసి, అది యాక్సెప్ట్ అయిందో లేదో కన్ఫామ్ చేసుకోండి. ఒకవేళ సర్టిఫికెట్ తిరస్కరణకు గురైనా, స్టేటస్ స్పష్టంగా కనిపించకపోయినా సంబంధిత బ్యాంకు లేదా పెన్షన్ చెల్లించే సంస్థను సంప్రదించండి. పెన్షనర్లు తమ వార్షిక జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమయానికి సమర్పించాలి.
నవంబర్ 30 చివరి తేదీగా పేర్కొన్న సందర్భంలో, ఆ గడువులోగా బయోమెట్రిక్ ధ్రువీకరణ, ఇంటి వద్ద డిజిటల్ సేవ లేదా సంబంధిత బ్యాంకు శాఖ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి. చివరి తేదీ మీ పెన్షన్ పథకానికి వర్తిస్తుందో లేదో సంబంధిత సంస్థ వద్ద నిర్ధారించుకోవడం మంచిది.




