Mutual Fund: ఇన్వెస్టర్లకు బిగ్ అలెర్ట్..ఈవారం 2 కొత్త స్కీమ్స్!

Mutual Fund: ఈ వారం సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉన్న Edelweiss Nifty Energy ETF , Aditya Birla Sun Life FMP NFOల పూర్తి వివరాలు.

Gagan kumar
Published on: 11 Nov 2026 11:59 AM IST
Mutual Fund
X

Mutual Fund: ఇన్వెస్టర్లకు బిగ్ అలెర్ట్..ఈవారం 2 కొత్త స్కీమ్స్!

Aditya Birla Sun Life: నూతన ఫండ్ ఆఫర్లు మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడి మార్గాలను పరిచయం చేస్తాయి. అయితే, ప్రతి వారం పదుల సంఖ్యలో NFOలు రావడం సాధారణం కాగా, ఈ వారం మాత్రం ఏస్ ఎంఎఫ్ గణాంకాల ప్రకారం ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం కేవలం 2 నూతన ఫండ్ ఆఫర్లు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి ఈక్విటీ రంగానికి చెందిన ప్యాసివ్ ETF కాగా, మరొకటి నిర్ణీత కాలపరిమితి కలిగిన డెట్ ఫండ్. ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి వీటిని పరిశీలించవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు NFOల పూర్తి వివరాలు ఇవే:

దేశీయ ఇంధన రంగాభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే వారి కోసం ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ ఈ నూతన ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్, ఓపెన్-ఎండెడ్ ETF .భారతీయ ఎనర్జీ సెక్టార్‌లో అగ్రగామిగా ఉన్న కంపెనీలతో కూడిన నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఆధారంగా ఈ ఫండ్ తన నిధులను కేటాయిస్తుంది. ఈ NFO సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే ప్రారంభమవగా, నవంబర్ 13, 2026తో ముగుస్తుంది. ఈ ఫండ్‌లో చేరేందుకు ప్రారంభంలో కనీసం రూ. 5,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్ల కోసం ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈ డెట్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. క్లోజ్-ఎండెడ్ డెట్ ఫండ్.ఈ ఫండ్ 114 రోజుల నిర్ణీత కాలపరిమితితో పనిచేస్తుంది. డెట్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం లేకుండా రాబడిని అందిస్తుంది. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 17, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస దరఖాస్తు మొత్తం రూ. 1,000గా నిర్ణయించారు.

NFO వస్తోంది కదా అని గుడ్డిగా పెట్టుబడి పెట్టడం సరైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. NFOలో నెట్ అసెట్ వాల్యూ రూ. 10కి వస్తుంది కాబట్టి లాభదాయకమని భావించడం పొరపాటు. పాత ఫండ్లయినా, కొత్త ఫండ్లయినా పోర్ట్‌ఫోలియోలోని షేర్ల పనితీరు ఆధారంగానే రాబడి ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి వ్యవధి, రిస్క్ ప్రొఫైల్‌కు ఈ ఫండ్లు సరిపోతాయో లేదో నిర్ధారించుకోవాలి. ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు సదరు ఫండ్ హౌస్ రికార్డులను, ఇండెక్స్‌ను ఎంత సమర్థవంతంగా అనుసరిస్తుందో పరిశీలించడం శ్రేయస్కరం.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.