అన్‌లిమిటెడ్ 4G/5G డేటా.. రూ. 15ల నుంచే ప్లాన్స్.. జియో నుంచి అదిరిపోయే ఆఫర్స్..!
Jio Happy New Year 2.0: రిలయన్స్ జియో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి "హ్యాపీ న్యూ ఇయర్" ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో రూ.399 నెలవారీ (28 రోజులు) ప్లాన్, రూ.3,999 వార్షిక ప్లాన్ ఉన్నాయి.
అన్‌లిమిటెడ్ 4G/5G డేటా.. రూ. 15ల నుంచే ప్లాన్స్.. జియో నుంచి అదిరిపోయే ఆఫర్స్..!
Jio Happy New Year 2.0: కొత్త సంవత్సరానికి ఇంకా సమయం ఉన్నా జియో ఇప్పటి నుంచే రీఛార్జ్ ఆఫర్లు ప్రారంభించింది. పూర్తి నెల లేదా ఏడాది కాకుండా, కొన్ని ప్రత్యేక రోజులు లేదా రాత్రివేళ ఎక్కువ ఇంటర్నెట్ కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని కూడా ఈ ప్లాన్లు రూపొందించారు.
రూ.399 ప్లాన్‌లో ఏముంది?
వాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు. కంపెనీ దీన్ని తన కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రీపెయిడ్ ప్లాన్‌గా చెబుతోంది. 12 నెలల కాన్వా (Canva) సబ్‌స్క్రిప్షన్. పోస్టర్లు, సోషల్ మీడియా పోస్టులు, ప్రెజెంటేషన్లు రూపొందించడానికి కాన్వా వాడతారు.
జియోహాట్‌స్టార్ మొబైల్, జియోటీవీ ద్వారా హాలీవుడ్ కంటెంట్, ఫ్యాన్‌కోడ్ (FanCode) యాక్సెస్. జియోగేమ్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియోఏఐక్లౌడ్‌లో 50GB క్లౌడ్ స్టోరేజ్. జస్ట్‌డయల్ లైట్, హైపర్‌లోకల్ కూపన్లు, డిజిటల్ డైరీ వంటి సేవలు.
రూ.3,999 వార్షిక ప్లాన్..
ప్రతి నెలా రీఛార్జ్ చేసే ఇబ్బంది లేకుండా ఏడాది ప్లాన్ కావాలనుకునేవారి కోసం రూ.3,999 ప్లాన్ ఉంది. వాలిడిటీ 365 రోజులు.
అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు. 12 నెలల కాన్వా ప్రో లైట్ (Canva Pro Lite) సబ్‌స్క్రిప్షన్. జియోహాట్‌స్టార్ మొబైల్, జియోటీవీ ద్వారా హాలీవుడ్ కంటెంట్, ఫ్యాన్‌కోడ్ యాక్సెస్, జియోఏఐక్లౌడ్‌లో 50GB స్టోరేజ్.
రూ.15, రూ.25 యాడ్-ఆన్లు: కొన్ని రోజులకే అన్‌లిమిటెడ్ 5G
ఆఫర్‌లో ప్రత్యేకంగా కనిపించేవి చిన్న రీఛార్జ్‌లు. ఒక్క రోజు ఎక్కువ ఇంటర్నెట్ అవసరమైతే నెల మొత్తం ఖరీదైన రీఛార్జ్ చేయక్కర్లేదు.
రూ.15: ఒక రోజు వాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా. రూ.25: రెండు రోజుల వాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా.
ఈ ప్యాక్‌లకు డౌన్‌లోడ్ పరిమితి, స్పీడ్ తగ్గింపు లేదా నిర్ణీత వినియోగ పరిమితి ఉండదని కంపెనీ చెబుతోంది. పెద్ద ఫైల్ డౌన్‌లోడ్ చేయాల్సిన రోజు, వీడియో అప్‌లోడ్ చేయాల్సిన రోజు వంటి సందర్భాల్లో ఇవి ఉపయోగపడతాయి.
రూ.50 నైట్ డేటా ప్యాక్. రాత్రివేళ ఎక్కువ ఇంటర్నెట్ వాడేవారి కోసం రూ.50 ప్యాక్ ప్రవేశపెట్టారు.
వాలిడిటీ 28 రోజులు.
ప్రతి రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా. రాత్రి వాడిన డేటా మీ ప్రధాన ప్లాన్ రోజువారీ డేటా బ్యాలెన్స్ నుంచి తగ్గదు. అంటే ఇది అదనపు డేటాగా లభిస్తుంది. ఉదయం 5 గంటల తర్వాత ఈ ప్యాక్ కింద అన్‌లిమిటెడ్ డేటా లభించదు. నైట్ షిఫ్ట్ చేసేవారికి, రాత్రి గేమ్స్ ఆడేవారికి, ఆలస్యంగా వీడియోలు చూసేవారికి ఇది ఉపయోగపడుతుంది.
ఏ ప్లాన్ ఎప్పటి నుంచి?
రూ.399 ప్లాన్ 2026 నవంబర్ 24 నుంచి
రూ.3,999 ప్లాన్ 2026 నవంబర్ 24 నుంచి
రూ.25 యాడ్-ఆన్ 2026 నవంబర్ 24 నుంచి
రూ.15 యాడ్-ఆన్ ఇప్పటికే అందుబాటులో ఉంది
రూ.50 నైట్ డేటా ప్యాక్ 2026 నవంబర్ 26 నుంచి
ఈ ప్లాన్లను మైజియో (MyJio) యాప్, Jio.com, జియో స్టోర్లు, దేశవ్యాప్తంగా అధికారిక రిటైలర్ల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు.




