Detergent Price Hike: సామాన్యులకు షాక్.. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు పెంపు!
Detergent Price Hike: సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ డిటర్జెంట్ ధరలను హెచ్యూఎల్ 11 శాతం వరకు పెంచింది. కొత్త ధరలు, ప్యాక్ల వారీ వివరాలు తెలుసుకోండి.
Detergent Price Hike: సామాన్యులకు షాక్.. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు పెంపు!
Detergent Price Hike: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్లైన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలను పెంచుతూ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) నిర్ణయం తీసుకుంది. వివిధ ఉత్పత్తుల ధరలను గరిష్ఠంగా 11 శాతం వరకు పెంచినట్లు వెల్లడించింది. ముడిసరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు అధికమయ్యాయని, లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజా ధరల పెంపుతో ఆయా బ్రాండ్లకు చెందిన వివిధ ప్యాకెట్లపై రూ.1 నుంచి రూ.10 వరకు అదనపు భారం పడనుంది. దీంతో డిటర్జెంట్ ఉత్పత్తులను క్రమం తప్పకుండా కొనుగోలు చేసే వినియోగదారుల నెలవారీ ఖర్చులు పెరగనున్నాయి.
సర్ఫ్ ఎక్సెల్ ధరలు ఎంత పెరిగాయంటే?
సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ ఒక కిలో ప్యాక్ ధర రూ.10 పెరిగి రూ.245కు చేరింది. 500 గ్రాముల ప్యాక్ ధర రూ.5 పెరిగి రూ.128గా ఉంది.
అలాగే సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఒక కిలో ప్యాక్ ధర రూ.5 పెరిగి రూ.172కు చేరింది. 500 గ్రాముల ప్యాక్ ధర రూ.2 పెరిగి రూ.87గా మారింది. సర్ఫ్ ఎక్సెల్ బార్ 250 గ్రాముల ప్యాక్ ధర రూ.3 పెరిగి రూ.45కు చేరింది. నాలుగు బార్ల బండిల్ ధర రూ.10 పెరిగి రూ.155గా ఉంది.
రిన్, వీల్ ఉత్పత్తుల ధరలూ పెంపు
సర్ఫ్ ఎక్సెల్తో పాటు రిన్, వీల్ ఉత్పత్తుల ధరలను కూడా హెచ్యూఎల్ పెంచింది. రిన్ అలా ధర రూ.5 పెరిగి రూ.95కు చేరింది. రిన్ డిటర్జెంట్ పౌడర్ ఒక కిలో ప్యాక్ ధర రూ.3 పెరిగి రూ.123కు చేరగా, 500 గ్రాముల ప్యాక్ ధర రూ.2 పెరిగి రూ.63గా ఉంది.
మరోవైపు వీల్ డిటర్జెంట్ పౌడర్ ఒక కిలో ప్యాక్ ధర రూ.3 పెరిగి రూ.93కు చేరింది. ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్ల ధరలు ఒకేసారి పెరగడంతో గృహ వినియోగదారులపై అదనపు భారం పడనుంది.




