Home Loan: ఎక్కువ వయసున్న వారికి హోమ్ లోన్ ఇస్తారా.? రూల్స్ ఏం చెబుతున్నాయంటే
Home Loan: ఉద్యోగ జీవితంలో కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, ఇతర బాధ్యతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో చాలామంది సొంతింటి కలను వాయిదా వేస్తుంటారు.
Home Loan: ఎక్కువ వయసున్న వారికి హోమ్ లోన్ ఇస్తారా.? రూల్స్ ఏం చెబుతున్నాయంటే
Home Loan: ఉద్యోగ జీవితంలో కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, ఇతర బాధ్యతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో చాలామంది సొంతింటి కలను వాయిదా వేస్తుంటారు. అయితే రిటైర్మెంట్ తర్వాత సొంత ఇల్లు ఉంటే వృద్ధాప్యంలో భద్రత, సౌకర్యం లభిస్తాయి. 60 ఏళ్ల తర్వాత బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయా.?
ఆదాయం, క్రెడిట్ స్కోర్ కీలకం
వృద్ధుల విషయంలో రుణ కాలపరిమితి, ఆదాయ స్థిరత్వం వంటి అంశాలను బ్యాంకులు ప్రత్యేకంగా పరిశీలిస్తాయి. పెన్షన్‌తో పాటు అద్దె, పెట్టుబడులు వంటి అదనపు ఆదాయం ఉంటే రుణ చెల్లింపు సామర్థ్యం మెరుగ్గా కనిపించొచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్ కూడా ముఖ్యమైన అంశమే. సాధారణంగా 700 లేదా అంతకంటే మెరుగైన స్కోర్ ఉంటే రుణ ఆమోదానికి అనుకూలంగా ఉండొచ్చు. గడువులోగా రుణ వాయిదాలు చెల్లించడం, క్రెడిట్ కార్డు బకాయిలను నియంత్రించడం, ఆలస్య చెల్లింపులు లేకుండా చూసుకోవడం ద్వారా క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగ్గా ఉంచుకోవచ్చు.
ఉమ్మడి రుణంతో అర్హత పెరిగే అవకాశం
సీనియర్ సిటిజన్లు తమ జీవిత భాగస్వామి లేదా స్థిరమైన ఆదాయం ఉన్న కుమారుడు, కుమార్తెను సహ-దరఖాస్తుదారుగా చేర్చుకుని జాయింట్ హోమ్ లోన్ కోసం ప్రయత్నించవచ్చు. బ్యాంకు మొత్తం ఆదాయాన్ని, ఇద్దరి రుణ చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో రుణ అర్హత పెరగొచ్చు. అయితే సహ-దరఖాస్తుదారు వయసు, ఆదాయం, క్రెడిట్ చరిత్ర వంటి అంశాలు కూడా రుణ నిబంధనలపై ప్రభావం చూపుతాయి.
ఎక్కువ డౌన్ పేమెంట్‌తో భారం తగ్గించుకోవచ్చు
రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించడం ఆర్థిక ఒత్తిడికి కారణం కావచ్చు. అందువల్ల అందుబాటులో ఉన్న పొదుపులు, ఎఫ్‌డీలు లేదా ఇతర నిధులతో సాధ్యమైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం ఉపయోగకరం. దీంతో అవసరమైన రుణ మొత్తం తగ్గి, నెలవారీ ఈఎంఐతో పాటు మొత్తం వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అయితే అత్యవసర ఖర్చులు, ఆరోగ్య అవసరాలకు అవసరమైన నిధులను పూర్తిగా ఇంటి కొనుగోలులో వినియోగించకుండా కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా ఉంచుకోవడం మంచిది.




