HDFC: ఆ పేమెంట్లకు ఇకపై నో SMS.. కొత్త రూల్ వివరాలు ఇవిగో...!

HDFC: రూ. 500 లేదా అంతకంటే తక్కువ విలువ గల యూపీఐ పేమెంట్స్‌కు 2027 జనవరి 1 నుంచి SMS అలర్ట్‌లను నిలిపివేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది, అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్‌లు కొనసాగుతాయి.

Ravi
By Ravi
Published on: 28 Nov 2026 12:26 PM IST
HDFC
X

HDFC: ఆ పేమెంట్లకు ఇకపై నో SMS.. కొత్త రూల్ వివరాలు ఇవిగో...!

రూ. 500 లేదా అంతకంటే తక్కువ విలువ గల యూపీఐ పేమెంట్స్‌కు SMS అలర్ట్‌లను నిలిపివేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్లకు మెసేజ్‌లు పంపుతోంది. 2027 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని బ్యాంక్ పేర్కొంది. అయితే లావాదేవీ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ పేమెంట్లకు ఈమెయిల్ అలర్ట్‌లు కొనసాగుతాయని బ్యాంక్ వెల్లడించింది. ఇందుకోసం రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది.

చిన్న మొత్తాల లావాదేవీలకు SMS పంపే విషయంలో బ్యాంకులే నిర్ణయం తీసుకునేలా ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు ఇచ్చాయని, ఆ నేపథ్యంలోనే ఈ మార్పు వస్తోందని తెలుస్తోంది. రూ. 500 లోపు చెల్లింపులకు SMS రాకపోవడంతో యూజర్లు తమ లావాదేవీల హిస్టరీని బ్యాంక్ యాప్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవడం మంచిది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలాంటి మార్పు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2024 జూన్ 25 నుంచి రూ. 100 వరకు చేసే యూపీఐ చెల్లింపులకు, రూ. 500 వరకు వచ్చే మొత్తాలకు SMS పంపడం ఆపేసింది. అప్పటి నుంచి రూ. 100కు మించి చెల్లించినప్పుడు, రూ. 500కు మించి అందుకున్నప్పుడు మాత్రమే SMS వస్తోంది. చిన్న లావాదేవీల అలర్ట్‌లు అనవసరమని కస్టమర్ల నుంచి అభిప్రాయం వచ్చిందని బ్యాంక్ అప్పట్లో తెలిపింది. యూపీఐ యాప్‌లు కూడా నోటిఫికేషన్లు పంపుతున్నాయని పేర్కొంది. ఇప్పుడు ఆ పరిమితిని రూ. 500 వరకు పెంచినట్లయింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.