HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్..!

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ రుణగ్రహీతలకు షాకిచ్చింది.

Gagan kumar
Published on: 12 Nov 2026 12:05 PM IST
HDFC Bank
X

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్..!

HDFC Bank interest rates: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ రుణగ్రహీతలకు చేదువార్త చెప్పింది. అన్ని కాలపరిమితులకు సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ ను 15 బేసిస్ పాయింట్ల (0.15%) వరకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 7 నుండే అమల్లోకి వచ్చాయి. ఈ తాజా సవరణతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లు కనిష్టంగా 7.85 శాతం నుండి గరిష్టంగా 8.70 శాతానికి చేరుకున్నాయి.

కాలపరిమితి వారీగా పెరిగిన వడ్డీ రేట్ల వివరాలు..

ఓవర్‌నైట్ ప్లాన్: 5 బేసిస్ పాయింట్లు పెంపు.

1 నెల & 3 నెలల ప్లాన్లు: 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంపు.

6 నెలలు, 1 ఏడాది, 2 ఏళ్లు & 3 ఏళ్ల ప్లాన్లు: గరిష్టంగా 15 బేసిస్ పాయింట్ల మేర పెంపు.

సాధారణంగా గృహ, ఆటో రుణాలకు ఎక్కువగా ప్రామాణికంగా తీసుకునే ఒక సంవత్సరం బెంచ్‌మార్క్ ఎంసీఎల్ఆర్ రేటు 8.30 శాతం నుండి 8.45 శాతానికి పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎంసీఎల్ఆర్ విధానానికి అనుసంధానమై ఉన్న గృహ , వ్యక్తిగత , వాహన రుణాలు తీసుకున్న వినియోగదారులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది.

వడ్డీ రేట్లు పెరగడం వల్ల నెలవారీ వాయిదాల మొత్తం పెరుగుతుంది. ఒకవేళ కస్టమర్లు తమ ఈఎంఐ మొత్తాన్ని మార్చకూడదని భావిస్తే, వారి రుణ చెల్లింపు కాలపరిమితి అదనంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ పెంపు కేవలం ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. రెపో రేటుకు అనుసంధానమైన రుణగ్రహీతలపై దీని ప్రభావం ఉండదు. మీ లోన్ రీసెట్ డేట్ ఆధారంగా ఈ కొత్త వడ్డీ రేట్లు మీ ఖాతాకు వర్తిస్తాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.