Gold Rate Today: పండుగ వేళ మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
Gold Rate Today: దసరా, దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది.
Gold Rate Today: పండుగ వేళ మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
Gold Rate Today: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, దీపావళి తదితర పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ బంగారం కొనుగోలుదారులకు ఇది నిజంగానే భారీ ఊరటనిచ్చే వార్త. గత రెండ్రోజులుగా చుక్కలనంటిన గోల్డ్ ధరల దూకుడుకు సోమవారం ఒక్కసారిగా బ్రేక్ పడింది. నిత్యం పరుగులు పెట్టిన పసిడి ధరలు అక్టోబర్ 12న శాంతించడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
పండుగ పూట బంగారం కొనేందుకు జనం ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఈ తరుణంలో ధరలు అకస్మాత్తుగా తగ్గడం వినియోగదారులకు, పెట్టుబడిదారులకు ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాల మధ్య, ఈ సోమవారం ధరల్లో వచ్చిన ఈ స్వల్ప బ్రేక్ ఆసక్తికరంగా మారింది.
నేటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్
24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్: రూ. 1,51,410
22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్: రూ. 1,38,790
ఢిల్లీ
24 క్యారెట్ల ప్యారెట్ గోల్డ్: రూ. 1,51,560
22 క్యారెట్ల గోల్డ్: రూ. 1,38,940
చెన్నై & బెంగళూరు
24 క్యారెట్ల గోల్డ్: రూ. 1,51,410
22 క్యారెట్ల గోల్డ్: రూ. 1,38,790
బంగారంతో పాటు సిల్వర్ ధరలు కూడా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ & చెన్నై: కిలో వెండి ధర రూ. 2,44,900 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ & బెంగళూరు: కిలో సిల్వర్ రేటు రూ. 2,39,900 వద్ద ట్రేడవుతోంది.
పండుగ సమయాల్లో బంగారం డిమాండ్ ఆకాశాన్నంటుతుంది. ఇలాంటి వేళ ధరలు కొద్దిగా వెనక్కి తగ్గడం షాపర్స్కు పండగ గిఫ్ట్ లాంటిదే మరి రానున్న రోజుల్లో పసిడి పరుగులు ఏ విధంగా ఉండబోతున్నాయో వేచి చూడాలి.




