Gold: అదే జరిగితే.! ధంతేరాస్‌కు బంగారం ధరలు తగ్గుతాయోచ్.. మహిళలకు గుడ్ న్యూస్..
Gold: చమురు ధరల హైక్‌తో ద్రవ్యోల్బణం ముదురుతుండటంతో కొన్నిరోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి.
Gold: అదే జరిగితే.! ధంతేరాస్‌కు బంగారం ధరలు తగ్గుతాయోచ్.. మహిళలకు గుడ్ న్యూస్..
Gold: చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం మరింత ముదురుతుండటంతో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పతనమవుతూ వస్తున్నాయి. దీనికి తోడు ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లకు డిమాండ్ పెరిగి బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27 నుంచి 28 తేదీలలో జరగబోయే యూఎస్ ఫెడ్ మీటింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవేళ వడ్డీ రేట్లను కనుక పెంచితే పసిడి ధర మరింత తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే ధంతేరాస్ అలాగే పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌కు తగినంత గోల్డ్ అందుబాటులో లేకపోతే లోకల్‌గా ధర మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు అలాగే దేశీయ మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలలో హెచ్చుతగ్గులు నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు వివరిస్తున్నాయి. పండగ సీజన్ దగ్గరపడుతున్న తరుణంలో కొనుగోలుదారులు ఈ మార్పులను నిశితంగా గమనిస్తున్నారు. బంగారపు మార్కెట్‌కు సంబంధించి రాబోయే రోజుల్లో వచ్చే ఆర్థిక నివేదికలు కీలకమైన పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.




