Gold Price Today: పండుగ సీజన్‌లో పసిడి ప్రియులకు భారీ ఊరట.. భారీగా తగ్గుతున్న ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా సంతోషకరమైన వార్త.

CR Reddy
Published on: 16 Oct 2026 7:36 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Price Today: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా సంతోషకరమైన వార్త. గత కొన్ని రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు నిలకడగా పడిపోతూ వస్తున్నాయి. వారం ప్రారంభం నుంచే ధరలు దిగొస్తుండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి వరుస పండుగలు రాబోతున్న వేళ బంగారం, వెండి కొనుగోళ్లకు మొగ్గు చూపే వారికి ఈ ధరల తగ్గుదల ఎంతగానో ఉపయోగపడుతోంది.

బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం దేశంలో పసిడి ధరలు ప్రస్తుతం దిగువ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,48,400 వరకు పలుకుతుండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,040 వద్ద కొనసాగుతోంది. ఇక దక్షిణాదిలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై అలాగే బెంగళూరు ప్రాంతాలలో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,47,430 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,140 దగ్గర ట్రేడవుతోంది.

కేవలం పసిడి మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు మరో ఊరటనిచ్చే అంశం. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,29,900 వద్ద కొనసాగుతుండగా, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో కిలో వెండి ధర సుమారు రూ.2,39,900 వద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులతో పోలిస్తే సిల్వర్ రేట్లు కూడా గణనీయంగా తగ్గడం వల్ల వెండి ఆభరణాలు లేదా నాణేలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా నిపుణులు చెబుతున్నారు.

వరుస పండుగల సమయాల్లో సాధారణంగా ఆభరణాల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలు, కరెన్సీ విలువ మార్పుల కారణంగా ప్రస్తుతం ధరలు అదుపులో ఉండటం సామాన్యులకు కలిసొచ్చే అంశం. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం పండుగలకు ముందే ధరలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో మార్కెట్లలో కొనుగోళ్ల సందడి క్రమంగా పెరుగుతోంది. పసిడిపై పెట్టుబడి పెట్టాలని భావించే వారికి కూడా ఇది మంచి అవకాశంగా మారుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.