Gold Rate Today: పసిడి ప్రియులకు తీపి కబురు.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు

నవంబర్ 8న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పుల వల్ల గత రెండు రోజులుగా తులం పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

CR Reddy
Published on: 8 Nov 2026 7:56 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Rate Today: గత కొన్ని రోజులుగా చుక్కలనంటిన పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. గత నెలలో అంతర్జాతీయంగా బంగారం ధరలు 6.3 శాతం మేర పతనం కావడంతో పసిడి గరిష్ఠ స్థాయిల నుంచి కిందకు పడిపోయింది. నవంబర్ ప్రారంభంలో రూ.1.46 లక్షలకు పైగా కొనుగోలైన తులం పసిడి ధర, గత రెండు రోజులుగా చూస్తే గణనీయంగా తగ్గి కస్టమర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ధన్‌తేరస్ వేళ రూ.60,000 కోట్లకు పైగా బంపర్ సేల్స్

ఇటీవల ముగిసిన ధన్‌తేరస్ పండుగ రోజున దేశవ్యాప్తంగా పసిడి కొనుగోళ్లు జోరుగా సాగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు 15 నుంచి 20 శాతం మేర పెరిగాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఒక్క ధన్‌తేరస్ రోజునే దేశంలో దాదాపు రూ.60,000 కోట్ల విలువైన బంగారం, వెండి వ్యాపారం జరిగింది. శుభసమయంలో పసిడి కొనుగోలు చేయడం ఆనవాయితీ కావడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. ఇప్పుడు పండుగ తర్వాతి రోజుల్లో ధరలు తగ్గడం వ్యాపారులకు, కస్టమర్లకు మరింత ఉత్సాహాన్నిస్తోంది.

హైదరాబాద్, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇవే

నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో పసిడి ధరలు పరిశీలిస్తే స్థిరంగా దిగివచ్చాయి. హైదరాబాద్ నగరం పరిధిలో 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.1,43,570 వద్ద కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,31,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏపీలోని విజయవాడలోనూ సరిగ్గా ఇదే ధరలు నమోదుకావడం విశేషం. పసిడి ధర తగ్గడంతో వ్యాపార కేంద్రాలు కస్టమర్లతో సందడిగా మారుతున్నాయి.

ఢిల్లీ, ముంబై సహా ఇత నగరాల్లో పరిస్థితి ఎలా ఉందంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,600 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,750 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,43,570 వద్ద నిలవగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,31,600 వద్ద లభిస్తోంది. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీల వ్యత్యాసం కారణంగా వివిధ నగరాల మధ్య ధరలలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.



నగరం 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) వెండి (1 కిలోగ్రాము)
హైదరాబాద్ రూ.1,31,600 రూ.1,43,570 రూ.2,05,000
విజయవాడ రూ.1,31,600 రూ.1,43,570 రూ.2,05,000
విశాఖపట్నం

రూ.1,31,600

రూ.1,43,570

రూ.2,05,000
అమరావతి

రూ.1,31,600

రూ.1,43,570

రూ.2,05,000
తిరుపతి

రూ.1,31,600

రూ.1,43,570

రూ.2,05,000
వరంగల్

రూ.1,31,600

రూ.1,43,570

రూ.2,05,000
ఢిల్లీ రూ.1,31,750 రూ.1,43,600 రూ.2,05,000
ముంబై రూ.1,31,600 రూ.1,43,570 రూ.2,05,000
చెన్నై రూ.1,31,600 రూ.1,43,570 రూ.2,05,000
కోల్‌కతా రూ.1,31,600 రూ.1,43,570 రూ.2,05,000
బెంగళూరు రూ.1,31,600 రూ.1,43,570 రూ.2,05,000

వెండి ధరలు కూడా దిగివచ్చాయ్

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పతనం కావడం గమనార్హం. పారిశ్రామిక వినియోగం, అంతర్జాతీయ డిమాండ్ హెచ్చుతగ్గుల ప్రభావం వెండిపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది. ఆర్బీఐ అగ్రికల్చర్ గోల్డ్ లోన్లకు సంబంధించి కొత్త నిబంధనలు తెచ్చిన నేపథ్యంలో, పసిడి మార్కెట్లో నమోదవుతున్న ఈ ధరల తగ్గుదల సాధారణ కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.