Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. తాజా రేట్లు ఇవే
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Gold Rate
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అలాగే సౌదీ-హౌతీల పరస్పర దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిణామాల మధ్య తాజాగా అక్టోబర్ 20వ తేదీన బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పసిడి ప్రియులు ధరల తీరును నిశితంగా గమనిస్తున్నారు.
తాజా బంగారం, వెండి ధరల వివరాలు
తాజా మార్కెట్ నివేదికల ప్రకారం, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 మేర పెరిగి రూ.1,48,050 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,35,710కి చేరింది. మరోవైపు వెండి ప్రియులకు కొంత ఊరట లభించింది. కిలో వెండి ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,29,900లుగా పలుకుతోంది. ప్రాంతాలను బట్టి స్థానిక పన్నులు అలాగే డిమాండ్ ఆధారంగా ఈ ధరల్లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది.
ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే
దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,050 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,710గా ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా సుమారు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,200గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,860గా నమోదైంది. వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల్లో కిలో వెండి రూ.2,39,900 వరకు ఉండగా, మిగతా నగరాల్లో రూ.2,29,900గా ఉంది.
కొనేముందు జాగ్రత్త
బంగారం, వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి కాబట్టి కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు తాజా ధరలను తనిఖీ చేయడం మంచిది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు అలాగే ఆభరణాలపై వేసే మేకింగ్ ఛార్జీల కారణంగా నగరాల వారీగా రేట్లు మారుతుంటాయి.




