Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price: పండుగలు అలాగే పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు మార్కెట్ నుంచి మంచి ఉపశమనం లభిస్తోంది.

CR Reddy
Updated on: 23 Oct 2026 9:40 AM IST
Gold Price
X

Gold Price 

Gold Price: పండుగలు అలాగే పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు మార్కెట్ నుంచి మంచి ఉపశమనం లభిస్తోంది. గతంలో రికార్డు స్థాయిలకు పరుగులు తీసిన పసిడి ధరలు ఇప్పుడు అదే వేగంతో దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, బలపడిన డాలర్ ప్రభావం కారణంగా దేశీయంగా బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రెండు వేల రూపాయల వరకు ధర తగ్గి వినియోగదారుల ముఖాల్లో ఆనందం నింపింది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబై నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,370 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,520గా నమోదుకాగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,490 వద్ద ట్రేడవుతోంది. పసిడి బాటలోనే వెండి కూడా స్థిరంగా దిగివచ్చి కిలోగ్రాముకు రూ.2,24,900 వద్ద విక్రయించబడుతోంది.


నగరం 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) వెండి (1 కిలోగ్రాము)
హైదరాబాద్ రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
విజయవాడ రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
విశాఖపట్నం రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
అమరావతి రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
తిరుపతి రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
వరంగల్ రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
ఢిల్లీ రూ.1,32,490 రూ.1,44,520 రూ.2,24,900
ముంబై రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
చెన్నై రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
కోల్‌కతా రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900
బెంగళూరు రూ.1,32,340 రూ.1,44,370 రూ.2,24,900

తగ్గిన రిటైల్ అమ్మకాలు

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అంచనాల ప్రకారం పండుగ సీజన్ నడుస్తున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే బంగారం అమ్మకాల పరిమాణం సుమారు 11 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవరిలో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ధరలు ఇంకా అధిక స్థాయిలోనే ఉండటంతో కస్టమర్లు కొనుగోలు చేసే బంగార పరిమాణాన్ని తగ్గించుకుంటున్నారు. ద్రవ్యోల్బణం ఆందోళనలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానాలు కూడా ఈ డిమాండ్‌పై కొంత ప్రభావం చూపుతున్నాయి.

పండగకు ఆఫర్లే ఆఫర్లు

ధంతేరస్, దీపావళి, భాయ్ దూజ్ పండుగల కోసం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లు సరికొత్త ఆఫర్లను ప్రకటించాయి. తయారీ ఛార్జీలపై 10 నుంచి 100 శాతం వరకు భారీ మినహాయింపులు ఇస్తున్నాయి. నిర్ణీత పరిమితికి మించి షాపింగ్ చేసేవారికి బంగారు నాణేలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా, పాత బంగారం మార్పిడి పథకాలు, బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే తక్షణ డిస్కౌంట్లను కల్పిస్తున్నాయి. తగ్గిన ధరలతో పాటు ఈ ఆఫర్లు కూడా తోడవడంతో కొనుగోలుదారులు తీవ్రంగా ఆసక్తి చూపుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.