Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి.
Gold Rate Today
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల కాలంలో చుక్కలను తాకిన ధరలు గత వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తుండటంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు అలాగే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు ధరల మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బులియన్ మార్కెట్ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నమోదైన ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,36,790 వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి ధర రూ.2,34,900 లుగా ఉంది. గతంతో పోలిస్తే పది గ్రాముల బంగారంపై సుమారు రూ.5 వేల వరకు ధర తగ్గడం గమనార్హం.
భారతదేశంలోని వివిధ నగరాల్లో పన్నులు, స్థానిక పరిస్థితులు, రవాణా ఖర్చులను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సుమారు రూ.1,49,580 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,790 చొప్పున ఉంది. కిలో వెండి ధర సుమారు రూ.2,35,000 నుంచి రూ.2,45,000 మధ్య ఉంది. జాతీయ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,390 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,950 గా ఉంది. ముంబై, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,49,240, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,800 చొప్పున విక్రయమవుతున్నాయి.
ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే వివిధ నగరాల్లోని ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్‌లలో మేకింగ్ చార్జీలు, జీఎస్టీ అదనంగా వర్తిస్తాయి. ఎవరైనా బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకుంటే ఆయా ప్రాంతాల్లోని స్థానిక ధరలను ముందే బేరీజు వేసుకోవడం ఉత్తమం.




