ESI: ESI లబ్దిదారులకు బిగ్ అలెర్ట్.! ఇకపై ఆ రెండింటికి సెపరేట్ క్లెయిమ్ అక్కర్లేదు..!

ESI సిక్‌నెస్, మెటర్నిటీ బెనిఫిట్స్‌కు ఇకపై సపరేట్ క్లెయిమ్ అవసరం లేదు. నగదు నేరుగా DBT ద్వారా వస్తుంది.

Ravi
By Ravi
Published on: 23 Nov 2026 9:00 AM IST
ESI
X

ESI: ESI లబ్దిదారులకు బిగ్ అలెర్ట్.! ఇకపై ఆ రెండింటికి సెపరేట్ క్లెయిమ్ అక్కర్లేదు..!

ఇకపై సిక్‌నెస్, మెటర్నిటీ బెనిఫిట్స్ కోసం సపరేట్ క్లెయిమ్స్ అవసరం లేదు. పేపర్ వర్క్ లేకుండా DBT ద్వారా నగదు పొందవచ్చు. ఇందుకు ESIC మెడికల్ సర్టిఫికెట్ జారీ అవడంతో పాటు యజమాని రిటర్న్స్ దాఖలు, ఉద్యోగి ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. గాయాలైనప్పుడూ సపరేట్‌గా అప్లై చేయక్కర్లేదు. యజమాని ఇచ్చే యాక్సిడెంట్ రిపోర్టునే క్లెయిమ్‌గా పరిగణిస్తారు. ESIC DG నిర్ణయించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.

ఈ మార్పులు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్, 2026లో భాగంగా వచ్చాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020 కింద ESIC ఈ నిబంధనలను నోటిఫై చేసింది. ఇవి 1950 నాటి పాత నిబంధనల స్థానంలోకి వస్తాయి, దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. దీని కింద సిక్‌నెస్, మెటర్నిటీ క్లెయిమ్స్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతాయి. అయితే 3 షరతులు పాటించాలి. ESIC సిస్టమ్ ద్వారానే మెడికల్ సర్టిఫికెట్ జారీ కావాలి. యజమాని నెలవారీ రిటర్న్‌ను పోర్టల్‌లో దాఖలు చేయాలి. ఉద్యోగి బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ కావడంతో పాటు, ఇన్సూరెన్స్ నంబర్ కూడా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.

గతంలో తాత్కాలిక వైకల్యం ఉన్న కార్మికులు వేర్వేరుగా క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. శాశ్వత వైకల్యం ఉన్నవారు, మృతి చెందిన కార్మికుల కుటుంబాలు యజమాని ప్రమాదాన్ని ESICకి తెలియజేసినా, తొలి చెల్లింపు కోసం దరఖాస్తు చేయాల్సి ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఆ అవసరం ఉండదు. క్లెయిమ్ పూర్తి వివరాలు, పత్రాలు అందిన 7 రోజుల్లో సిక్‌నెస్ బెనిఫిట్, 14 రోజుల్లో మెటర్నిటీ బెనిఫిట్ తొలి విడత చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి.

కార్మికులు కావాలనుకుంటే తామే క్లెయిమ్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంటుంది. యజమాని సమయానికి రిటర్న్ లేదా వెరిఫికేషన్ సమర్పించలేదన్న కారణంతో మాత్రమే బెనిఫిట్స్ ఆపకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ సమాచారాన్ని ESIC యజమాని నుంచే సేకరించాలి. సాంకేతిక సమస్య లేదా బ్యాంక్ ఖాతా సమస్యతో DBT విఫలమైతే, కారణాలు నమోదు చేసి మరో చెల్లింపు విధానం వాడవచ్చు. ఈ మార్పులు సుమారు 4 కోట్ల మంది బీమా కార్మికులకు, 15 కోట్ల మంది లబ్ధిదారులకు వర్తిస్తాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.