Driving License: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా.? సెప్టెంబర్ 25లోపు ఈ పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవు
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతీ ఒక్కరికీ కీలక ప్రకటన. సెప్టెంబర్ 25వ తేదీలోపు లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Driving License: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా.? సెప్టెంబర్ 25లోపు ఈ పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవు
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతీ ఒక్కరికీ కీలక ప్రకటన. సెప్టెంబర్ 25వ తేదీలోపు లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ లైసెన్స్‌కు, మొబైల్ నెంబర్‌కు సంబంధం ఏంటనేగా మీ సందేహం.
డ్రైవింగ్ లైసెన్స్‌కి మొబైల్ నంబర్‌కి ఏంటి సంబంధం.?
ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అనేక సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. అలాంటి సేవలను ఉపయోగించేటప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPలు రావడం, లైసెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందడం అవసరం కావచ్చు. మొబైల్ నంబర్ పాతదిగా ఉండటం లేదా అసలు నమోదు కాకపోవడం వల్ల సంబంధిత సమాచారం సకాలంలో అందకపోవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా వాహన యజమానులు, డ్రైవింగ్ లైసెన్స్‌దారులు తమ మొబైల్ నంబర్లను VAHAN, SARATHI డేటాబేస్‌లలో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ వివరాలు సరిగ్గా ఉంటే సేవలకు సంబంధించిన అలర్ట్లు, సందేశాలు, నోటీసులు సరైన వ్యక్తికి చేరే అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్ 25 గడువు..
డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని, ఇందుకు సెప్టెంబర్ 25 చివరి తేదీ అని వార్తలు వైరల్ అవుతున్నాయి. గడువులోగా అప్‌డేట్ చేయకపోతే లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇంటి నుంచే మొబైల్ నంబర్ ఎలా మార్చుకోవాలి?
డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్ మార్చుకోవడానికి సాధారణంగా RTO కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా Sarathi Parivahan ద్వారా ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులో ఉంది. ముందుగా అధికారిక Sarathi Parivahan వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకుని “Others” విభాగంలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే “Mobile Number Update” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ విధానాన్ని Parivahan అధికారిక FAQ కూడా సూచిస్తోంది.
తర్వాత అడిగిన వివరాల్లో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. స్క్రీన్‌పై కనిపించే లైసెన్స్ వివరాలను ఒకసారి పరిశీలించిన తర్వాత కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త నంబర్‌కు వచ్చే OTPను నమోదు చేసి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. రాష్ట్రాన్ని బట్టి కొన్ని దశల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
మీ లైసెన్స్‌లో నంబర్ ఉందో లేదో ఇలా చెక్ చేయండి
చాలామంది తమ డ్రైవింగ్ లైసెన్స్ రికార్డులో ప్రస్తుతం ఏ మొబైల్ నంబర్ ఉందో కూడా తెలుసుకోకుండా ఉంటారు. ముఖ్యంగా పాత లైసెన్స్ ఉన్నవారు, మొబైల్ నంబర్ మార్చుకున్నవారు ఈ వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది. దీని కోసం Sarathi Parivahan అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మీ రాష్ట్రాన్ని ఎంచుకుని డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలను పరిశీలించవచ్చు. మొబైల్ నంబర్ అప్‌డేట్ అవసరమైతే అక్కడి మొబైల్ నెంబర్ అప్‌డేట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.




