మందు బాబులకు గుడ్ న్యూస్..తగ్గనున్న మద్యం ధరలు!

India New Zealand Trade Deal: న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా గొర్రె మాంసం, కివీస్, వైన్, ఇతర ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Gagan kumar
Published on: 19 Oct 2026 10:15 AM IST
India New Zealand Trade Deal:
X

మందు బాబులకు గుడ్ న్యూస్..తగ్గనున్న మద్యం ధరలు!

India New Zealand Trade Deal: భారత ప్రభుత్వం దేశ ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. న్యూజిలాండ్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని నిర్దిష్ట వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. పండుగ సీజన్‌కు ముందే ఈ నిర్ణయం వెలువడటంతో మార్కెట్లో కొన్ని రకాల దిగుమతి గూడ్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. తొలి విడతగా కొన్ని ప్రత్యేక వస్తువులకు మాత్రమే ఈ కస్టమ్స్ రాయితీలు వర్తించనున్నాయి. శీతల, ఘనీభవించిన గొర్రె మాంసంపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ సున్నా శాతానికి పరిమితం చేశారు. కిలోగ్రాముకు 2.50 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కివీ పండ్లపై కేవలం 15 శాతం మాత్రమే పన్ను విధించనున్నారు. వివిధ రకాల ఫిష్ ఉత్పట్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 25.71 శాతంగా ఉంచగా.. ఏఐడీసీ, హెల్త్ సెస్సులను పూర్తిగా సున్నాకి తగ్గించారు. వీటితో పాటు వైన్, మనుకా తేనె వంటి ప్రసిద్ధ న్యూజిలాండ్ ఉత్పత్తుల ధరలు కూడా రానున్న రోజుల్లో మరింత ప్రియమైనవి కాకుండా చౌకగా మారే మార్గం సుగమమైంది.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. దేశీయ రైతులు, స్థానిక మార్కెట్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక రంగాలకు రక్షణ కల్పించింది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు, ఇతర ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి సుంకం మినహాయింపులు ఇవ్వలేదు. ఇవి యథావిధిగా నిబంధనల పరిధిలోనే ఉంటాయి.

ఈ రాయితీలు పూర్తిగా పొందాలంటే దిగుమతిదారులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకునే వస్తువులు కచ్చితంగా న్యూజిలాండ్ మూలానికి చెందినవే అని నిరూపించే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ రుజువును సమర్పించాలి. ఆర్థిక చట్టం, 1962లోని సెక్షన్ 25(1) ప్రకారం జారీ అయిన ఈ మార్గదర్శకాలు నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటాయి. రానున్న కాలంలో ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా మరిన్ని వస్తువులపై రాయితీలు లభించే అవకాశం ఉండటంతో, సామాన్యులకు దిగుమతి వస్తువుల ధరల విషయంలో మరింత ఊరట లభించనుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.