Govt Schemes: రైతులకు కేంద్రం సూపర్ గిఫ్ట్.. పూచీకత్తు లేకుండానే అకౌంట్లోకి రూ.5 లక్షలు

Govt Schemes: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు అదిరిపోయే తీపికబురు అందించింది.

CR Reddy
Published on: 9 Oct 2026 7:38 AM IST
Govt Schemes: రైతులకు కేంద్రం సూపర్ గిఫ్ట్.. పూచీకత్తు లేకుండానే అకౌంట్లోకి రూ.5 లక్షలు
X

Govt Schemes: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు అదిరిపోయే తీపికబురు అందించింది. పంటల సాగు కోసం కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా ఇచ్చే రుణాల పరిమితిని భారీగా పెంచింది. ఇంతకుముందు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల వరకే లోన్ ఇచ్చేవారు. కానీ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ డబ్బులు సరిపోవడం లేదని భావించిన సర్కార్.. రాబోయే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆ లిమిట్‌ను ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు తమ అవసరాలకు తగ్గట్లుగా సులువుగా బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోవచ్చు.

వడ్డీ భారం చాలా తక్కువ

ఈ రుణాలపై వడ్డీ కూడా చాలా తక్కువే ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. కానీ, తీసుకున్న అప్పును కరెక్ట్‌గా ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా 1.5 శాతం అదనపు సబ్సిడీ కూడా ఇస్తారు. అంటే ఫైనల్‌గా రైతు కేవలం 4 శాతం వడ్డీకే లోన్ తీసుకున్నట్లు అవుతుంది. లోన్ శాంక్షన్ అయిన వెంటనే బ్యాంకు వాళ్లు కిసాన్ రూపే కార్డు అందజేస్తారు. ఆ కార్డుతో ఎప్పుడైనా, ఎక్కడైనా ఏటీఎంకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?

సొంతంగా వ్యవసాయ భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలు (SHGs) కూడా ఈ లోన్స్ తీసుకోవచ్చు. కేవలం పంటలు పండించే వాళ్లకే కాకుండా.. పాడి రైతులు, కోళ్ల ఫారాలు పెంచేవాళ్లు, చేపల పెంపకం చేసేవాళ్లకు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు ఇస్తారు. దరఖాస్తు చేసుకునే వాళ్ల వయసు 18 నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీలు ఉంటే లోన్ ఈజీగా వచ్చేస్తుంది.

ఆన్‌లైన్‌లో సింపుల్‌గా అప్లై..

బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పనిలేకుండా ఆన్‌లైన్‌లోనే చాలా సింపుల్‌గా ఈ లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ బ్యాంకులో అయితే మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందో.. ఆ బ్యాంకు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ KCC Loan అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, ఏ పంట వేస్తున్నారో ఎంటర్ చేయాలి. ఈ-కేవైసీ కంప్లీట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బ్యాంకు అధికారులు మీ అర్హతలను ఆన్‌లైన్‌లోనే చెక్ చేసి, నేరుగా మీ అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.