Crypto: క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. బినాన్స్‌పై భారీ సైబర్ దాడి!

Crypto: బినాన్స్‌పై చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో హ్యాక్, 6.3 బిలియన్ డాలర్ల మోసం, 3 బిలియన్ డాలర్లు ఫ్రీజ్ అయినట్టు తెలుస్తోంది.

Ravi
By Ravi
Published on: 30 Oct 2026 6:21 PM IST
Crypto
X

Crypto: క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. బినాన్స్‌పై భారీ సైబర్ దాడి!

Crypto: క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ బినాన్స్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. ఈ మోసం విలువ సుమారు 6.3 బిలియన్ డాలర్లు. అంచనా ప్రకారం 5.9 బిలియన్ డాలర్ల క్రిప్టో చోరీకి గురైంది. 2025లో బైబిట్‌పై జరిగిన 1.5 బిలియన్ డాలర్ల హ్యాక్ కంటే ఇది 4.2 రెట్లు ఎక్కువ. ఈ దాడి ఉత్తర కొరియాకు చెందిన TraderTraitor గ్రూప్ పనేనని సమాచారం.

హ్యాక్ తర్వాత బినాన్స్ హాట్ వాలెట్ల నుంచి సుమారు 3.3 బిలియన్ డాలర్లు అనుమానాస్పదంగా బయటకు వెళ్లాయి. దీంతో బినాన్స్ డిపాజిట్లు, విత్‌డ్రాలను తాత్కాలికంగా నిలిపివేసింది. బినాన్స్ ఆల్ఫా ట్రేడింగ్ కూడా ఆగిపోయింది. సెక్యూరిటీ చెక్స్ చేస్తూ, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. యూజర్ల ఫండ్స్ సురక్షితంగా ఉన్నాయని కూడా స్పష్టం చేసింది.

బినాన్స్ ధృవీకరించిన ప్రకారం మొదట 2.54 బిలియన్ డాలర్లు ఫ్రీజ్ అయ్యాయి. తర్వాత ఈ మొత్తం సుమారు 3 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో టెథర్ 1.567 బిలియన్ డాలర్లు, సర్కిల్ 800 మిలియన్ డాలర్లు ఫ్రీజ్ చేశాయి. హ్యాకర్ బోరో చేసిన 44.6 మిలియన్ డాలర్ల తర్వాత ఆవే తన మార్కెట్లను ఫ్రీజ్ చేసింది. బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో ఇది హ్యాక్‌లాగే కనిపిస్తోందని ప్రకటించారు. యూజర్లందరికీ పూర్తిగా నష్టపరిహారం అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోల్పోయిన అసలు మొత్తం, దాడి జరిగిన విధానంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.