Bank Holidays List: ఈ వారం బ్యాంకులకు సెలవులు ఇవే..!
Bank Holidays List: అక్టోబర్ 12 నుంచి 18 వరకు ఆర్బీఐ బ్యాంక్ సెలవుల జాబితా విడుదలైంది.
Bank Holidays List: ఈ వారం బ్యాంకులకు సెలవులు ఇవే..!
Bank Holidays October: బ్యాంకు సెలవులకు సంబంధించి ప్రతీ వారం ఆర్బీఐ విడుదల చేసే క్యాలెండర్ చాలా కీలకమనే చెప్పాలి. జాతీయ సెలవులు దేశవ్యాప్తంగా వర్తిస్తే, ప్రాంతీయ పండుగలు మాత్రం రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. ప్రతి నెలా వచ్చే రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు సాధారణ సెలవుదినాలుగా ఉంటాయి. ఖాతాదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, బ్యాంకులకు వెళ్లేముందు ఈ సెలవుల జాబితాను పరిశీలించడం చాలా ముఖ్యం.
అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 17 వరకు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఎలాంటి ప్రత్యేక సెలవులు లేవు. అన్ని బ్యాంక్ శాఖలు యథావిధిగా పనిచేస్తాయి. మహా సప్తమి వేడుకల పురస్కరించుకుని త్రిపురలోని అగర్తలాలో మాత్రం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఇది మూడో శనివారం కావడంతో దేశంలోని మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు సాధారణంగానే తెరిచి ఉంటాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారంతపు సాధారణ సెలవు.
ఈ నెలలో రానున్న దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సులభంగా నిధులు బదిలీ చేసుకోవచ్చు. లోన్ అప్లికేషన్లు లేదా ఇతర ఆర్థిక లావాదేవీలను బ్యాంక్ శాఖలకు వెళ్లకుండానే ఆన్లైన్ ద్వారా హాయిగా పూర్తి చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని బట్టి ప్రాంతీయ సెలవులు మారుతుంటాయి కాబట్టి, అత్యవసర పనులపై బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించే ముందు ఒకసారి స్థానిక బ్యాంకు అధికారులను సంప్రదించడం మంచిది.




