3) Bank Holidays November 2026: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
Bank Holidays November 2026: నవంబర్‌లో బ్యాంకు పనులు పూర్తి చేయాలనుకునే ఖాతాదారులు సెలవుల వివరాలను ముందుగానే తెలుసుకోవాలి. దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి వంటి పండుగలతో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కారణంగా బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.
3) Bank Holidays November 2026: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
Bank Holidays November 2026: నవంబర్‌లో బ్యాంకు పనులు పూర్తి చేయాలనుకునే ఖాతాదారులు సెలవుల వివరాలను ముందుగానే తెలుసుకోవాలి. దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి వంటి పండుగలతో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కారణంగా బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.
నవంబర్‌లో సాధారణ బ్యాంకు సెలవులు
దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు సాధారణంగా ఆదివారాలు, ప్రతి నెల రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులు ఉంటాయి. 2026 నవంబర్‌లో ఈ సెలవులు వచ్చే తేదీలు:
ఆదివారాలు: నవంబర్ 1, 8, 15, 22, 29.
రెండో శనివారం: నవంబర్ 14.
నాలుగో శనివారం: నవంబర్ 28. ఈ తేదీల్లో బ్యాంకు శాఖలు మూసివేస్తారు. అదనంగా కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పండుగల కారణంగా ఇతర రోజుల్లోనూ సెలవులు ఉంటాయి.
నవంబర్ 1 నుంచి 11 వరకు బ్యాంకు సెలవులు
నెల ప్రారంభంలో పలు ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
నవంబర్ 1న హర్యానా దినోత్సవం, కన్నడ రాజ్యోత్సవం, కుట్ పండుగ సందర్భంగా సంబంధిత ప్రాంతాల్లో సెలవు. నవంబర్ 2వ తేదీన నోంగ్‌క్రెమ్ నృత్య ఉత్సవం సందర్భంగా మేఘాలయలో సెలవు. నవంబర్ 9వ తేదీన దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజ సందర్భంగా త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో సెలవు ఉంది. ఇక నవంబర్ 10వ తేదీన బలి ప్రతిపద, గోవర్ధన్ పూజ, విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం సందర్భంగా గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలో సెలవు ఉంటుంది. నవంబర్ 11న భాయ్ దూజ్, నింగోల్ చకౌబా, చిత్రగుప్త జయంతి సందర్భంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూతపడతాయి.
నవంబర్ 13 నుంచి 20 వరకు సెలవులు
నెల మధ్యలోనూ పలు రాష్ట్రాల్లో పండుగల కారణంగా బ్యాంకింగ్ సేవలకు విరామం ఉండనుంది. నవంబర్ 13వ తేదీన వంగాలా పండుగ సందర్భంగా మేఘాలయలో సెలవు ఉంటుంది. అలాగే నవంబర్ 16న ఛత్ పూజ సందర్భంగా బీహార్, జార్ఖండ్‌లో బ్యాంకులు పనిచేయవు. నవంబర్ 20న ఇగాస్-బగ్వాల్ పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో సెలవు. ఈ తేదీల్లో సంబంధిత రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖలు మూసివేస్తారు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం స్థానిక సెలవుల జాబితాను బట్టి బ్యాంకులు పనిచేస్తాయి.
నవంబర్ 23, 24, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు
నవంబర్ చివరి వారంలోనూ కొన్ని ముఖ్యమైన పండుగల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబర్ 23న సెంగ్ కుట్ స్నేమ్ పండుగ సందర్భంగా మేఘాలయలో సెలవు ఉంటుంది. నవంబర్ 24వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు ఉండనుంది. ఇక నవంబర్ 27న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు. నవంబర్ 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు సాధారణ సెలవులు ఉంటాయి.
బ్యాంకులకు సెలవులున్నా ఈ సేవలు అందుబాటులోనే
బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ చాలా వరకు డిజిటల్ సేవలను వినియోగించుకోవచ్చు. యూపీఐ యాప్స్ ద్వారా నగదు బదిలీ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా మనీ విత్‌డ్రా వంటి సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అయితే చెక్కుల క్లియరెన్స్, శాఖల్లో నిర్వహించే నగదు లావాదేవీలు వంటి పనులకు ఆలస్యం కావచ్చు. అందువల్ల బ్యాంకుకు వెళ్లే ముందు మీ ప్రాంతానికి వర్తించే సెలవులను పరిశీలించండి. అత్యవసర లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. రాష్ట్రాల వారీగా సెలవుల వివరాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్‌ను పరిశీలించండి.




