Bank Holidays: నవంబర్‌లో సెలవులే సెలవులు. ఏ రోజుల్లో బ్యాంకులు మూతపడతాయో తెలుసా..?

Bank Holidays: నవంబర్ 2026 నెలలో పండుగలు , వారాంతపు హాలిడేస్ కారణంగా బ్యాంకులు భారీగా మూతపడనున్నాయి.

Gagan kumar
Published on: 31 Oct 2026 11:25 AM IST
Bank Holidays
X

Bank Holidays: నవంబర్‌లో సెలవులే సెలవులు. ఏ రోజుల్లో బ్యాంకులు మూతపడతాయో తెలుసా..?

RBI bank holiday list: నవంబర్ నెల ప్రారంభమవుతున్న వేళ, బ్యాంకు వినియోగదారులకు ఆర్బీఐ కీలక హెచ్చరిక జారీ చేసింది. పండుగలు, జాతీయ సెలవులు, వారపు సెలవుల కారణంగా ఈ నెలలో అనేక రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లే వినియోగదారులు ముందస్తుగా తమ ప్లాన్‌ సిద్ధం చేసుకోవడం ఎంతో అవసరం.

ఒక్కో రాష్ట్రంలో సంస్కృతి, స్థానిక పండుగలను బట్టి సెలవుల జాబితా మారుతుంటుంది. నవంబర్ నెలలోని ముఖ్యమైన పండుగలైన దీపావళి, లక్ష్మీపూజ, గోవర్ధన పూజ, ఛత్ పూజ, గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమల సందర్భంగా వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

నవంబర్ నెలలో ప్రాంతీయ, పండుగ సెలవుల వివరాలు చూద్దాం.

నవంబర్ 8: ఆదివారంతో పాటు దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

నవంబర్ 9: లక్ష్మీపూజ పురస్కరించుకుని త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు మూతపడతాయి.

నవంబర్ 10: గోవర్ధన్ పూజ, విక్రమ్ సంవంత్ నూతన సంవత్సరం సందర్భంగా గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలలో సెలవు.

నవంబర్ 11: భాయిదూజ్/భ్రాత్రిద్వితీయ కారణంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.

నవంబర్ 13: వాంగాలా పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంక్ సెలవు.

నవంబర్ 16: ఛత్ పూజ పురస్కరించుకుని బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.

నవంబర్ 20: ఐగాస్-బాగ్వాల్ వేడుకల సందర్భంగా ఉత్తరాఖండ్‌లో సెలవు.

నవంబర్ 23: సెంగ్ కుట్ స్నెమ్ పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు బంద్.

నవంబర్ 24:గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ సందర్భంగా తెలంగాణ, ఏపీతో పాటు న్యూఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

నవంబర్ 27: కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.

పండుగల సెలవులతో పాటు సాధారణ వారాంతపు సెలవులైన ఆదివారాలు, రెండో , నాలుగో శనివారాల కారణంగా నవంబర్ 1, 8, 14, 15, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. శాఖలకు వెళ్లే పని లేకుండా, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ , ఏటీఎం సేవలు ఎప్పటిలాగే సజావుగా అందుబాటులో ఉంటాయి. అత్యవసర నగదు లేదా ఇతర ఆర్థిక సేవలకు డిజిటల్ మార్గాలను ఉపయోగించడం ఉత్తమం. బ్యాంకింగ్ పనులకు వెళ్లే ముందు స్థానిక సెలవుల క్యాలెండర్‌ను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.