SBI: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

SBI: బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఎస్బీఐ సహా పలు బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Gagan kumar
Published on: 27 Sept 2026 9:36 AM IST
SBI
X

SBI: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

SBI: వారంలో ఐదు రోజుల పనిదినాలు, ఖాళీల భర్తీ వంటి పలు కీలక డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు సమ్మె కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం చివరి రోజులు కావడంతో ఎలాంటి అంతరాయం కలగకుండా సెప్టెంబర్ 27 (ఆదివారం) ప్రత్యేకంగా బ్యాంకులు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సమ్మె జరిగే మూడు రోజుల (సెప్టెంబర్ 28 నుంచి 30) పాటు ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేశాయి. అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ శాలరీ అకౌంట్లపై ఇతర బ్యాంక్ ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని 10 నుంచి 5కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లిమిట్ దాటితే క్యాష్ విత్‌డ్రాయల్‌కు రూ.23 + జీఎస్టీ వర్తిస్తుంది.

సమ్మె కారణంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల బ్రాంచ్ ఆధారిత పనులన్నీ ఆదివారమే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు కోరాయి. నగదు అవసరాల కోసం ఏటీఎంలు, కస్టమర్ సర్వీస్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. సాధారణ పేమెంట్లు, నగదు బదిలీల కోసం మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, యూపీఐ , నెఫ్ట్ , ఆర్‌టీజీఎస్ , ఐఎంపీఎస్ వంటి డిజిటల్ మార్గాలను ఎంచుకోవాలని బ్యాంకులు సూచించాయి. సమ్మె కాలంలో ఖాతాదారులు ఇబ్బంది పడకుండా తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఊరటనిచ్చే విషయమే.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.