ఇది క‌దా అస‌లైన దీపావ‌ళి అంటే.. కారు కొనే వారికి 100 శాత లోన్‌, 30 నిమిషాల్లోనే డ‌బ్బులు

Axis Bank Festive Offers 2026: దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

Mokshith
Published on: 5 Nov 2026 4:53 PM IST
Axis Bank Festive Offers 2026
X

ఇది క‌దా అస‌లైన దీపావ‌ళి అంటే.. కారు కొనే వారికి 100 శాత లోన్‌, 30 నిమిషాల్లోనే డ‌బ్బులు

Axis Bank Festive Offers 2026: దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కారు లోన్లు, టూ వీలర్ లోన్లు, హోమ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లతో పాటు క్రెడిట్ కార్డులపై పలు ప్రయోజనాలను అందిస్తోంది.

కారు కొనేవారికి 100 శాతం వరకు లోన్

దీపావళి సందర్భంగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి యాక్సిస్ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. కారు ఆన్‌రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా రుణం ఆమోదం పొందిన తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇతర ప్రయోజనాల విషయానికొస్తే.. ప్రాసెసింగ్ ఫీజు, సంబంధిత ఛార్జీలపై 50 శాతం తగ్గింపు ఇస్తోంది. ఎంపిక చేసిన కార్ల మోడళ్లపై వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల తగ్గింపు కూడా అందిస్తోంది. ఈ లోన్‌ను గరిష్ఠంగా 8 సంవత్సరాల వరకు చెల్లించే వెసులుబాటు కల్పించింది. అలాగే 24 నెలల తర్వాత లోన్ ముందుగానే చెల్లించినా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ ప్రయోజనాలు నిబంధనలకు లోబడి వర్తిస్తాయి.

టూ వీలర్, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు

టూ వీలర్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక రుణ సదుపాయాలు ప్రకటించింది. టూ వీలర్ లోన్ తీసుకునే అర్హులైన వినియోగదారులకు 30 నిమిషాల్లోనే రుణ మొత్తాన్ని విడుదల చేసే అవకాశం కల్పిస్తోంది. సూపర్ బైక్ లోన్లపై వడ్డీ రేట్లు ఏడాదికి 10.75 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఇక ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసేవారికి వర్తించే వడ్డీ రేటులో 0.5 శాతం తగ్గింపు అందిస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి కొంత ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

ఎడ్యుకేషన్ లోన్లు, చిన్న వ్యాపారాలకు ప్రయోజనాలు

విద్యార్థులకు కూడా బ్యాంక్ పండుగ ఆఫర్లు ప్రకటించింది. దేశీయ విద్యా రుణాలపై వడ్డీ రేట్లు ఏడాదికి 7.25 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు సున్నా నుంచి అందుబాటులో ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులకు వర్తించే సాధారణ వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపు కల్పిస్తోంది.

చిన్న వ్యాపారాలు నిర్వహించే వారికి కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్, టర్మ్ లోన్ వంటి ఎంపిక చేసిన సెక్యూర్డ్ వర్కింగ్ క్యాపిటల్ రుణాలపై లాగిన్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఇస్తోంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే సాధారణ ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రం వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

క్రెడిట్ కార్డులు, హోమ్ లోన్లపై ఆఫర్లు

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ దీపావళికి 200కు పైగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, షాపింగ్, లైఫ్‌స్టైల్, గృహోపకరణాల కొనుగోళ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఎంపిక చేసిన బ్రాండ్ల వద్ద అర్హత కలిగిన కొనుగోళ్లు, ఈఎంఐ లావాదేవీలపై 20 శాతం వరకు తగ్గింపులు, ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ఇల్లు కొనాలనుకునే వారికి హోమ్ లోన్లపై ప్రత్యేక సదుపాయాలు ప్రకటించింది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో లాగిన్ ఫీజును రూ.999 + జీఎస్టీగా నిర్ణయించింది. అంతేకాకుండా నిబంధనలకు లోబడి 12 ఈఎంఐల మినహాయింపు, అసలు రుణ మొత్తాన్ని వేగంగా తగ్గించుకునే ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.