Amazon vs Flipkart Sale: మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు.. బెస్ట్ డీల్స్ మీకోసం..!

Online Shopping Sale 2026: పండగ సీజన్ షాపింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్స్‌లో మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Venkat
Published on: 8 Oct 2026 12:20 PM IST
Amazon vs Flipkart Sale
X

Amazon vs Flipkart Sale: మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు.. బెస్ట్ డీల్స్ మీకోసం..!

Online Shopping Sale 2026: పండగ సీజన్‌లో కొత్త మొబైల్ లేదా టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్స్‌పై ఓ లుక్కేయాల్సిందే. రెండు ఈ-కామర్స్ సంస్థలు ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ప్రత్యేక ధరలు ప్రకటించాయి. అయితే ప్రతి ఉత్పత్తికి ఒకే ప్లాట్‌ఫామ్‌లో తక్కువ ధర ఉండకపోవడంతో కొనుగోలు చేసే ముందు రెండు సైట్లలో ధర, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ చెక్ చేయడం మంచిది.

అమెజాన్‌లో మొబైల్స్‌ డీల్స్..

అమెజాన్‌లో ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన ధరలు కనిపిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా 5G రూ. 84,999కు లభిస్తోంది. ఇందులో రూ. 5,000 కూపన్ ప్రయోజనం కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ56 5G రూ. 31,999కు అందుబాటులో ఉంది. అలాగే వన్ ప్లస్ నార్డ్ 6 రూ. 42,999, వన్ ప్లస్ నార్డ్ CE6 రూ. 33,999 ధరల వద్ద ఉన్నాయి.

బడ్జెట్ 5G ఫోన్ కోసం చూస్తున్నవారికి iQOO Z11 Lite 5G రూ. 15,499, రెడ్ మీ 15C 5G ప్రైమ్ ఎడిషన్ రూ. 15,999, లావా బోల్డ్ N4 ప్రో 5G రూ. 13,999 ధరల వద్ద ఉన్నాయి.

iPhone 16 కూడా అమెజాన్ సేల్‌లో ప్రత్యేక ఆఫర్‌తో ఉంది. తాజా వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో దీని ధర సంవత్సరంలోనే అత్యల్ప స్థాయికి చేరింది.

ఫ్లిప్ కార్ట్‌లో మొబైల్ ఆఫర్లు..

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో iPhone 17 ధర రూ. 79,999 నుంచి ప్రారంభమవుతోంది. మెటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ రూ. 29,999 నుంచి లభిస్తోంది. Apple, Samsung, Motorola, Google, Nothing వంటి బ్రాండ్లపై ప్రత్యేక ధరలు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి.

అందువల్ల ఐఫోన్ కొనాలనుకునేవారు ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 17 ధరను, అమెజాన్‌లో ఐఫోన్ 16 ధరను పోల్చుకోవడం మంచిది. కొత్త మోడల్ కావాలా, తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలా అన్నదాని ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు.

టీవీల్లో ఏది బెస్ట్?

టీవీ కొనుగోలుదారులకు కూడా ఈ సేల్ మంచి అవకాశం. ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ క్రిస్టల్ 4K విజన్ AI 43-inch TV రూ. 28,999కు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 39,900గా చూపిస్తున్నారు. అంటే సుమారు 27 శాతం తగ్గింపు ఉంది. ఎక్స్ఛేంజ్ ద్వారా అదనంగా రూ. 6,900 వరకు ప్రయోజనం లభించే అవకాశం ఉంది.

50 ఇంచుల శాంసంగ్ క్రిస్టల్ 4K విజన్ ఏఐ టీవీ రూ. 36,999కు, 55-inch మోడల్ ₹41,499కు లభిస్తున్నాయి. పెద్ద స్క్రీన్ 4K టీవీ కోసం చూస్తున్న వారికి ఇవి పరిశీలించదగిన డీల్స్.

అమెజాన్‌లో కూడా టీసీఎల్ 55 ఇంచుల క్యూడీ మినీ ఎల్ఈడీ గూగుల్ టీవీ రూ. 59,990కు లభిస్తోంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 4K క్యూడీ మినీ ఎల్ఈడీ ప్యానెల్, 46W Onkyo 2.1 సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాంక్ ఆఫర్లను మర్చిపోవద్దు..!

సేల్‌లో చూపిస్తున్న ధరే తుది ధర అని భావించకూడదు. అమెజాన్‌లో ఎస్బీఐ క్రెడిట్/డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా అర్హత ఉన్న కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది. ప్రైమ్ సభ్యులకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఫ్లిప్ కార్ట్ లో యాక్సిక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో అర్హత ఉన్న లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏది ఎక్కడ కొనాలి?

రూ. 15,000 లోపు 5G ఫోన్: అమెజాన్‌లో iQOO Z11 Lite 5G, Lava Bold N4 Pro 5G వంటి ఆప్షన్లు చూడొచ్చు.

రూ.30,000–₹40,000 మొబైల్: అమెజాన్‌లో OnePlus Nord CE6, Samsung Galaxy A56; ఫ్లిప్ కార్ట్ లో Motorola Edge 70 Fusion వంటి ఆప్షన్లు ఉన్నాయి.

iPhone: కొత్త iPhone 17 కోసం ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ఆసక్తికరంగా ఉంది. తక్కువ ధరలో iPhone కావాలంటే అమెజాన్‌లో iPhone 16 డీల్ పరిశీలించవచ్చు.

43-inch 4K TV: ఫ్లిప్ కార్ట్ లో Samsung Crystal 4K Vision AI రూ. 28,999 మంచి ఆప్షన్.

55-inch ప్రీమియం TV: అమెజాన్‌లో TCL QD-Mini LED రూ. 59,990 ప్రత్యేక ఫీచర్లతో ఉంది.

మొత్తంగా చూస్తే ఒకే ప్లాట్‌ఫామ్‌లో అన్ని ఉత్పత్తులు చౌకగా ఉంటాయని చెప్పలేం. మొబైల్ మోడల్, బ్యాంక్ కార్డు, ఎక్స్ఛేంజ్ విలువ, ఈఎంఐ ఆఫర్ ఆధారంగా తుది ధర మారుతుంది. అందుకే కొనుగోలు చేసే ముందు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ రెండింటిలోనూ ఫైనల్ ధరలను పోల్చి చూడటం ఉత్తమం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.