Amazon Sale.. ఈ డీల్స్ మిస్ కావద్దు.. రూ.వేలలో సేవింగ్.!

షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026' కు కౌంట్‌డౌన్ షురూ అయింది. ఈ మెగా ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8, 2026

G Krishna
Published on: 27 Sept 2026 12:34 PM IST
Amazon Great Indian Festival
X

Amazon Great Indian Festival 

షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026' కు కౌంట్‌డౌన్ షురూ అయింది. ఈ మెగా ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8, 2026 నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని అమెజాన్ ప్రకటించింది. అయితే ప్రధాన సేల్‌కు ముందే కస్టమర్ల కోసం 'అర్లీ డీల్స్' (Early Deals) ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు , హోమ్ అప్లయన్సెస్‌పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు, హోమ్ & కిచెన్ ఉత్పత్తులపై 60 శాతం వరకు, రోజువారీ అవసరాల వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులు

కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి అర్లీ డీల్స్ ద్వారా బ్యాంక్ ఆఫర్లతో కలిపి ప్రత్యేక ధరలు లభిస్తున్నాయి. 7,000mAh భారీ బ్యాటరీతో వస్తున్న OnePlus N6x ఫోన్ సాధారణ ధర రూ. 19,999 కాగా, బ్యాంక్ ఆఫర్లతో రూ. 18,499 కే లభిస్తోంది. అలాగే రూ. 18,999 విలువైన iQOO Z10 Lite 5G మోడల్ బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 15,999 కు చేరుకుంది. గేమింగ్ , హై-పెర్ఫార్మెన్స్ లవర్స్ కోసం ఉద్దేశించిన iQOO Neo 10 ఆఫర్లలో రూ. 41,999 కు అందుబాటులో ఉంది. బడ్జెట్ విభాగంలో రూ. 12,999 విలువైన Lava Bold N2 ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో రూ. 8,729 కే లభిస్తోంది.

గ్యాడ్జెట్లు, స్మార్ట్‌వాచ్‌లు , ల్యాప్‌టాప్‌లపై డీల్స్

ఇతర ఎలక్ట్రానిక్స్ విభాగంలోనూ ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. OnePlus Watch 2R ప్రస్తుతం రూ. 9,999 కు లభిస్తుండగా, ల్యాప్‌టాప్ విభాగంలో Apple 2026 MacBook Neo 13 ధర రూ. 71,990 గాను, ASUS Vivobook 15 ధర రూ. 59,990 గాను నిర్ణయించబడ్డాయి. నాణ్యమైన ఆడియో కోసం Marshall Acton III స్పీకర్ రూ. 27,999 కు లిస్ట్ అయింది.

స్మార్ట్ టీవీలు , కెమెరాలపై ప్రత్యేక తగ్గింపులు

ఇంటి వినోదాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారి కోసం స్మార్ట్ టీవీలపై కూడా భారీ ధర తగ్గింపులు ఉన్నాయి. Samsung 55-inch Mini LED 4K Vision AI TV రూ. 53,900 కు, TCL 55-inch QD-Mini LED Google TV రూ. 62,990 కు, , LG 55-inch NU87 AI webOS TV రూ. 45,990 కు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫొటోగ్రఫీ ప్రియుల కోసం Sony Alpha ILCE-6700 మిర్రర్‌లెస్ కెమెరా రూ. 1,25,990 కు లభిస్తోంది.

హోమ్ అప్లయన్సెస్ , రోజువారీ వస్తువులపై ఆఫర్లు

పెద్ద గృహోపకరణాల విషయానికొస్తే, Samsung 653L AI Smart Refrigerator ధర రూ. 82,990 గాను, Bosch 8kg Front-Load Washing Machine ధర రూ. 31,490 గాను లిస్ట్ అయ్యాయి. హోమ్ & కిచెన్ ప్రొడక్ట్స్‌పై 60 శాతం వరకు, గ్రోసరీ , డైలీ ఎసెన్షియల్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చని అమెజాన్ పేర్కొంది.

SBI కార్డ్‌లతో 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్

అర్లీ డీల్స్‌లోని ప్రకటించిన ధరలపై అర్హత ఉన్న SBI క్రెడిట్/డెబిట్ కార్డులు , EMI లావాదేవీలపై అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు ఎంపిక చేసిన ఆఫర్లపై మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి.

అమెజాన్ పే (Amazon Pay) వినియోగదారులకు అదనపు లబ్ధి

Amazon Pay ICICI Bank Credit Card కలిగిన ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్‌లో చేసే కొనుగోళ్లపై అన్‌లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ వినియోగదారులకు 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అర్హత గల వినియోగదారులకు రూ. 2,500 వరకు వెల్‌కమ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే Amazon Pay Later ద్వారా ఎంపిక చేసిన ఉత్పత్తులపై 10% క్యాష్‌బ్యాక్ తో పాటు, రూ. 1,500 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్లకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 3 నెలల నో-కాస్ట్ EMI వెసులుబాటు ఉంది.

ప్రధాన సేల్ అక్టోబర్ 8 నుంచి..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ప్రధాన సేల్ అక్టోబర్ 8 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. సేల్ ప్రారంభ తేదీ నాటికి మరిన్ని ఉత్పత్తులపై కొత్త డీల్స్ , ధర తగ్గింపులను ప్రకటించే అవకాశముంది. ఉత్పత్తి లభ్యత, బ్యాంక్ ఆఫర్లు , స్టాక్‌ను బట్టి ధరలు మారవచ్చు కాబట్టి, కొనుగోలు చేసే ముందు అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో తుది ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.