Bank Discount: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు హెచ్చరిక.. కార్డ్ ఆఫర్ల వెనుక దాగున్న సీక్రెట్ ఇదే

Bank Discount: పండగ షాపింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వినియోగదారులకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు శుభవార్త అందించాయి.

CR Reddy
Published on: 8 Oct 2026 9:36 AM IST
amazon flipkart sale
X

amazon flipkart sale

Bank Discount: పండగ షాపింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వినియోగదారులకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు శుభవార్త అందించాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్లస్ సభ్యులు, ప్రత్యేక బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 8 నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపులు లభించే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్ల జోరు

ఈ దఫా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సహా ఇదే తరహా ప్రయోజనాలు కల్పిస్తున్నారు. వీటితో పాటు కొత్తగా పరిచయం చేసిన సూపర్ మనీ సర్వీస్ ద్వారా చేసే మొదటి లావాదేవీపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలు పొందడానికి నిర్దేశిత అర్హత ప్రమాణాలు, పరిమితులు వర్తిస్తాయి.

అమెజాన్‌లో ఎస్‌బీఐ కార్డుల హవా

అటు అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు కొన్ని ఈఎమ్‌ఐ లావాదేవీలపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీనితో పాటు కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై 35 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించినా, గరిష్ట పరిమితిని రూ.150కే పరిమితం చేశారు. అమెజాన్ పే లేటర్ ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పించారు.

10 శాతం డిస్కౌంట్ వెనుక అసలు రహస్యం

ప్రకటనల్లో కనిపించే 10 శాతం డిస్కౌంట్ అనే మాట చూసి ప్రతీ వస్తువుపై అంత మొత్తం ఆదా అవుతుందని భావిస్తే పొరపాటే. బ్యాంకులు ఇచ్చే ఆఫర్లకు గరిష్ట పరిమితి నిబంధన ఉంటుంది. ఉదాహరణకు ఎంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినా డిస్కౌంట్ పరిమితి 1,500 లేదా 2,000 రూపాయల వరకే ఉంటుంది. బిజినెస్ లేదా కార్పొరేట్ కార్డులకు ఈ ఆఫర్లు వర్తించవు. సాధారణ కార్డ్ పేమెంట్లు, ఈఎమ్‌ఐ చెల్లింపులకు వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి.

జాగ్రత్తలు పాటిస్తేనే అసలైన పొదుపు

షాపింగ్ కార్ట్‌లో వస్తువులను జోడించిన తర్వాత చెల్లింపుల పేజీలోకి వెళ్లినప్పుడు మాత్రమే అసలైన తగ్గింపు ధర కనిపిస్తుంది. అందుకే ఆర్డర్ కన్ఫర్మ్ చేసే ముందు బ్యాంక్ ఆఫర్ నిబంధనలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించడం ఎంతో మంచిది. లాస్ట్ పేమెంట్ పేజీలో చూపే మొత్తం చూసుకున్న తర్వాతే పేమెంట్ పూర్తి చేయాలి. ఇలా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే పండగ షాపింగ్‌లో వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.