ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 200 రీఛార్జ్‌తో యూట్యూబ్ యాడ్స్‌కు ఇక గుడ్‌బై!

Airtel 200 recharge: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.200 వినోద టాప్-అప్‌లో అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. 28 రోజుల కాలపరిమితితో 30జీబీ అదనపు డేటాతో పాటు యూట్యూబ్ ప్రీమియం సదుపాయం లభిస్తుంది.

Venkat
Published on: 24 Oct 2026 10:15 AM IST
Airtel 200 recharge
X

ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 200 రీఛార్జ్‌తో యూట్యూబ్ యాడ్స్‌కు ఇక గుడ్‌బై!

Airtel 200 recharge: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.200 టాప్-అప్‌లో యూట్యూబ్ ప్రీమియం సదుపాయాన్ని జోడించింది. ఈ ప్యాక్‌కు 28 రోజుల కాలపరిమితి ఉంటుంది. దీంతో పాటు 30జీబీ అదనపు డేటా లభిస్తుంది. యూట్యూబ్‌లో ప్రకటనలు లేకుండా వీడియోలు చూసే అవకాశం కూడా ఉంటుంది.

యూట్యూబ్ ప్రీమియంతో ఇవీ ప్రయోజనాలు..

ఈ ప్యాక్ ద్వారా లభించే యూట్యూబ్ ప్రీమియం సేవలో పలు సదుపాయాలు ఉన్నాయి. వీడియోలు, షార్ట్స్‌ను ప్రకటనలు లేకుండా చూడొచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం కూడా ఉపయోగించుకోవచ్చు. వీడియోలను డౌన్‌లోడ్ చేసి ఆఫ్‌లైన్‌లో చూడటంతో పాటు ఫోన్ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా ఆడియో వినే అవకాశం ఉంటుంది.

యూట్యూబ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియోహాట్‌స్టార్, జీ5 ప్రీమియం, సోనీలివ్ వంటి యాప్స్ ఉన్నాయి. ఎయిర్‌టెల్ వినోద ఆఫర్‌లో 18కి పైగా ఇతర ఓటీటీలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వీటిని అదనంగా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

28 రోజులకే యూట్యూబ్ ప్రీమియం..

ఈ ప్యాక్‌లోని యూట్యూబ్ ప్రీమియం శాశ్వత సభ్యత్వం కాదు. రూ.200 టాప్-అప్‌కు ఉన్న 28 రోజుల కాలపరిమితితోనే ఈ ప్రయోజనం కొనసాగుతుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత సేవను కొనసాగించాలంటే మళ్లీ టాప్-అప్ తీసుకుని యాప్‌లో క్లెయిమ్ చేయాలి.

ఒక విషయం గుర్తుంచుకోవాలి..

రూ.200 ప్యాక్ సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్ కాదు. మీ ఎయిర్‌టెల్ నంబర్‌పై ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉండాలి. ఈ టాప్-అప్ ద్వారా కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు అందుబాటులోకి రావు. మెయిన్ రీఛార్జ్ గడువు ముగిసినప్పుడు కేవలం రూ.200 ప్యాక్ తీసుకోవడం వల్ల కాలింగ్ సేవలు తిరిగి ప్రారంభం కావు.

యూట్యూబ్ ప్రీమియం ఎలా పొందాలి?

ముందుగా ఎయిర్‌టెల్ నంబర్‌పై రూ.200 వినోద టాప్-అప్ తీసుకోవాలి. తరువాత ఎయిర్‌టెల్ యాప్‌లోని ‘రివార్డ్స్ & ఓటీటీలు’ విభాగంలోకి వెళ్లి యూట్యూబ్ ప్రీమియం ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ కనిపించే సూచనలను అనుసరించి క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాలి. సరైన గూగుల్ లేదా యూట్యూబ్ ఖాతాను ఎంచుకోవడం ముఖ్యమైన విషయం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.