Madanapalle: పుంగనూరు ఘర్షణ కేసు A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A4గా హర్షవర్ధన్ రెడ్డి!

Madanapalle: పుంగనూరులో మున్సిపల్ నామినేషన్ల ఘర్షణ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని A1గా, మదనపల్లె యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిని A4గా పేర్కొంటూ మొత్తం 62 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 19 Oct 2026 6:47 AM IST
Madanapalle
X

Madanapalle: పుంగనూరు ఘర్షణ కేసు A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A4గా హర్షవర్ధన్ రెడ్డి!

Madanapalle: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని A1గా, సుధీర్ రెడ్డిని A2గా, మాజీ ఎంపీ రెడ్డప్పను A3గా, మదనపల్లె నియోజకవర్గ వైసీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిని A4గా పేర్కొన్నారు.

యశ్వంత్‌ను A5గా, నాగభూషణాన్ని A6గా పేర్కొంటూ మొత్తం 62 మందిని కేసులో నిందితులుగా చేర్చినట్లు సమాచారం. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle